దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే ఎన్‌ఆర్‌సి పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నేడు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రసంగిస్తూ.. ఎన్‌ఆర్‌సి అనే ప్రధానమైన సవాలును మన దేశం ఎదుర్కొంటోందన్నారు. 73 సంవత్సరాల స్వాతంత్య్రం అనంతరం భారత రాజ్యాంగంలో మౌలికమైన స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసేలా బిజెపి వ్యవహరిస్తోందన్నారు. విశాలమైన భారతదేశంలో వివిధ జాతులు, వివిధ భాషలు, వివిధ మతాలు, స్వేచ్ఛగా జీవిస్తున్నాయని తెలిపారు. బ్రిటీష్ వారు వెళిపోతూ.. భారతదేశం నుండి పాకిస్తాన్‌ను విడదీసి మత వైషమ్యానికి కారకులయ్యారని, దేశంలో లౌకికతత్వాన్ని, మత సామరస్యాన్ని కాపాడేందుకు వామపక్షాలు తీవ్రంగా కృషి చేశాయని గుర్తు చేశారు.