పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు,మందులు ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన చేపట్టారు. బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క మే నెలలోనే 22 సార్లు పెంచారని, కరోనా నేపధ్యంలో సామాన్యుల జీవితాలు దుర్బరం అయ్యాయని, ఇటువంటి సమయంలో ప్రజలను ఆదుకోవడానికి చర్యలు చేపట్టకపోగా ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని వాపోయారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు రోజుగడవని పరిస్థితి దాపురించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు.