స్టేట్ గెస్ట్ హౌస్ స్థలం అమ్మకంపై నిరసన

విజయవాడ లెనిన్ సెంటర్ లో స్టేట్ గెస్ట్ హౌస్ స్థలాన్ని అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా ,స్టేట్ గెస్ట్ హౌజ్ సందర్శన... ఒక వైపున కేంద్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే, మరోవైపున రాష్ట్రప్రభుత్వం విలువైన ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటు.విజయవాడ నగరంలో రాజ్ భవన్ సమీపంలో వందలాది కోట్ల రూపాయల విలువైన స్టేట్ గెస్ట్ హౌస్ స్థలాన్ని బిల్డ్ ఏపీ పేరుతో తెగ నమ్మటం సిగ్గుచేటు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమ్మకాన్ని వ్యతిరేకించిన వైసిపి నేడు అధికారంలో రాగానే మాట మార్చి అమ్మకానికి పెడుతోంది.ప్రజల ఆస్తులు అమ్మకాన్ని వ్యతిరేకిస్తాం, ప్రతిఘటిస్తాం, ప్రజల ఆస్తులు కాపాడుకుంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు అన్నారు.