రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేయాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 04 డిసెంబర్‌, 2023.

 

రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేయాలి

- సిపిఐ(యం) డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన దృష్ట్యా దాని అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)  రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఇప్పటి వరకు రాజధానిపై నోరు మెదపకుండా తుంపులు పెట్టి తమాషా చూస్తున్న కేంద్రం పార్లమెంటులో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని స్పష్టంగా ప్రకటించింది. ఇప్పటికైనా నాటకాలకు స్వస్తి చెప్పి అమరావతి అభివృద్ధికి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) కోరింది. ఆ మేరకు ఈ సెషన్‌లోనే ప్రకటన చేయాలని డిమాండ్‌ చేసింది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి