కోవిడ్‌ పై వెంటనే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

 

విజయవాడ,

తేది : 26 డిసెంబర్‌, 2023.

 

కోవిడ్‌ పై వెంటనే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.

ఈ రోజు మన రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఒక మహిళ మరణించడం బాధాకరం.  పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ కోవిడ్‌ కేసులు పెరగడంతో పాటు ఒక మరణం కూడా రికార్డ్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మన రాష్ట్రంలో కోవిడ్‌ విజృంభించకుండా, అలాగే వైరస్‌ సోకిన వారికి వైద్యం అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత. నూతన సంవత్సరాది అలాగే సంక్రాంతి పండగ వస్తున్న నేపథ్యంలో ఇది విజృంభించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. కోవిడ్‌ రెండవ దశ విజృంభణ సమయంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులు, తీవ్ర ప్రాణనష్టము తిరిగి ఎట్టి పరిస్థితుల్లో జరక్కుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు పారామెడికల్‌ సిబ్బందినీ, అవసరమైన మందులను, ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్లను సమకూర్చవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రజలను అప్రమత్తం చేసి కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలి.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి