భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 మే, 2024.
మాజీమంత్రి, విజయ డైరీ డైరెక్టర్ శ్రీమతి యెర్నేని సీతాదేవి మరణం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటిస్తున్నది. ఆమె భర్త, రైతు ఉద్యమ నాయకుడు శ్రీ యెర్నేని నాగేంద్రనాధ్ ఇటీవలే మరణించారు. వీరిరువురూ రైతు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆమె కుటుంబ సభ్యులకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి