సావిత్రమ్మ గారి మృతికి సంతాపం
పార్టీ సానుభూతిపరురాలు, పార్టీకి అండగా ఉన్న కుటుంబం సావిత్రమ్మ గారిది. సిపిఎం ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యాలయం కార్యదర్శిగా ఉన్న జె.జయరాం, తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి బాబూరావు తల్లి గారైన జానీ సావిత్రమ్మ గారు ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. వారి కుటుంబంతో నాకు వ్యక్తిగతంగా సానిహిత్య సంబంధం ఉంది. మా అమ్మగారు సావిత్రమ్మగారు మంచి స్నేహితులుగా ఉండేవారు. వారి యావత్ కుటుంబం పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నది. రాష్ట్ర కమిటీ తరఫున సావిత్రిమ్మ గారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి ఆమె కుమారుడు జ్యోతిశ్వరరావు, బాబురావు, జయరాం లకు సానుభూతిని తెలియజేస్తున్నాను.