భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 ఆగష్టు, 2024.
వయనాడ్ ప్రజలకు అండగా నిలుద్దాం.
-సిపిఐ(యం)
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో 300 మందికి పైగా మృత్యువాతపడ్డారు. వందలాదిమంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది జాడ కానరావడం లేదు. బాధిత ప్రజలకు జరిగిన నష్టం పూడ్చలేనిది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎంత సహాయ సహకారాలు అందిచినప్పటికీ యావత్ భారత ప్రజానీకం అండగా నిలవాల్సిన సమయమిది.
విపత్తు వేళ కేరళలోని వయనాడ్‌కు ప్రజలంతా అండగా నిలవాలని సిపిఐ(యం) పొలిట్‌బ్యూరో పిలుపు మేరకు సిపిఐ(యం) ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి బాధితులకు పంపాలని నిర్ణయించింది. ఆగష్టు 3,4 తేదీలలో రాష్ట్ర వ్యాపితంగా ప్రజల వద్దకు వెళ్లి బాధితులకు సహాయార్ధం విరాళాలు సేకరించాలని నిర్ణయించింది.
బాధితులకు ఉదారంగా విరాళాలిచ్చి సంఫీుభావాన్ని చాటాలని సిపిఐ(యం) ఆంధ్రప్రదేశ్ కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది. రిలీప్ ఫండ్‌కు డబ్బు పంపేందుకు అవసరమైన బ్యాంక్ ఖాతా వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
అకౌంట్ పేరు: సిపిఐ(యం) పీపుల్స్ రిలీఫ్ ఫండ్
అకౌంట్ నెంబరు: 62109192143
బ్యాంకు పేరు: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఐఎఫ్‌ఎస్‌సి కోడ్: SBIN 0020343
బ్రాంచ్ పేరు : బీసెంట్ రోడ్ బ్రాంచ్, విజయవాడ.
విరాళం పంపిన తర్వాత సమాచారం 9490099018 కు వాట్సాప్‌కు లేదా [email protected] మెయిల్ పంపాల్సి ఉంటుంది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org