ఉపాధిహామి పనులకు నిధుల కేటాయింపు పెంచాలని, జాబు కార్డులు పొందిన ప్రతీ కుంటుంబానికి 100 రోజులు పని కల్పించాలని

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ                                                                                               

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 11 ఆగష్టు, 2024.

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామి గ్రామ సభలు జరపడంతో పాటుగా ఉపాధిహామి పనులకు నిధుల కేటాయింపు పెంచాలని, జాబు కార్డులు పొందిన ప్రతీ కుంటుంబానికి 100 రోజులు పని కల్పించాలని, కాంట్రాక్టర్లకు కేటాయించకుండా పనులను విస్తృతంగా చేపట్టి మరిన్ని ఉపాధి పనులు కల్పించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేస్తున్నది.

రాష్ట్రవ్యాప్తంగా 13326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ ద్వారా జాబు కార్డులు పొందిన ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత. గ్రామాలలో ఏవిధమైన పనులు చేపట్టాలో ప్రజలతో చర్చించడానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ చట్టం వచ్చినప్పటినుండి ఆగ్రామంలో ప్రతి ఆర్థిక సంవత్సరం ముందు ఆ గ్రామంలో ఉపాధి హామీ ద్వారా మట్టి పనులతో అభివృద్ధి చేయడానికి కావలసిన పనులు ఎంపిక చేయడానికి గ్రామ సభలు జరుగుతున్నాయి. కాబట్టి వ్యవసాయ కార్మికులు చేయగలిగిన 29 రకాల పనులు, కాలువలు తవ్వకం, మట్టి తీయటం, జంగిల్‌ క్లియరెన్స్‌ లాంటి  పనులు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తించాయి. ఉపాధి హామీ ద్వారా భూమి అభివృద్ధి పనులు అనేకం ఉన్నాయి. ఆ పనులను విస్తృతంగా చేపట్టి తద్వారా గ్రామ అభివృద్ధి, మట్టి రోడ్లు ద్వారా వ్యవసాయ కార్మికులకి మరిన్ని ఉపాధి పనులు కల్పించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి