తుంగభద్ర గేటుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి.. నీరు వృధా కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ        
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 12 ఆగష్టు, 2024.

తుంగభద్ర గేటుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి
నీరు వృధా కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి
        తుంగభద్ర ప్రాజెక్టు 19వ నెంబర్‌ గేటు కొట్టుకుపోవటంతో దీనితో
ప్రాజెక్టులో ఉన్న నీరు వృధాగా దిగువకు వెళ్ళిపోయి హెచ్చెల్సి, ఎల్లెల్సి
సాగునీటి ఆయకట్టుకు నీరు అందకుండా పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. ఉమ్మడి
అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పంటలకు  సాగునీటి ఇబ్బంది లేకుండా అవసరమైన
చర్యలు తీసుకోవాలి. నిర్వహణలో నిర్లక్ష్యం మూలంగా గతంలో పులిచింతల,
గుండ్లకమ్మ గేట్లు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయాయి. తక్షణమే
కొట్టుకుపోయిన గేటు అవసరమైన మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి.
డ్యామ్‌లో నీళ్లు పూర్తిగా ఖాళీ కాకముందే ప్రత్యామ్నాయ చర్యలతో నీరు
దిగువకు వృధాగా పోకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి