వైద్య, ఆరోగ్య రంగంలో పిపిపి వద్దు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

వైద్య, ఆరోగ్య రంగంలో పిపిపి వద్దు

వైద్య, ఆరోగ్య రంగం సమీక్ష సందర్భంలో నియోజకవర్గ ఆసుపత్రులు పిపిపి విధానంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడిరచారు. దీనర్థం పబ్లిక్‌ ప్రయివేటు పార్టర్‌షిప్‌తో ప్రయివేటు రంగానికి ప్రభుత్వ ఆస్పత్రులు ధారాదత్తం చేయడమే. గత రెండు దశాబ్దాలుగా పిపిపి విధానం అమలుచేసినందువలన ప్రజలకు ఏ రకమైన ప్రయోజనము కలగలేదు. ప్రభుత్వ రంగంలో వైద్య రంగం ఉంటేనే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుంది. పిపిపి విధానం కేవలం ప్రయివేటు యాజమాన్యాల లాభాల కోసం ఉపయోపడుతుందని అనుభవాలు చెబుతున్నాయి. అందుకని ఈ విధానం అమలుచేసే ఆలోచనను ప్రభుత్వం మానుకొని వైద్య,ఆరోగ్య రంగంలో పూర్తి బాధ్యత తీసుకొని వైద్య సిబ్బందిని, వసతులు పూర్తిగా కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాం.

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి