వరద బాధిత ప్రాంతాలలో ఆగష్టు నెల కరెంట్‌ బిల్లు మాఫీ చేయాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 06  సెప్టెంబరు, 2024.

వరద బాధిత ప్రాంతాలలో ఆగష్టు నెల కరెంట్‌ బిల్లు మాఫీ చేయాలి

వరద బాధిత ప్రాంతాల్లో ఆగష్టు నెల కరెంటు బిల్లు మాఫీ చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది.

ఇటీవల వచ్చిన వరదల నష్టం నుండి తేరుకోకముందే వివిధ ప్రాంతాలలో విద్యుత్‌ శాఖ సిబ్బంది వినియోగదార్లకు కరెంటు బిల్లులు అందజేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తీవ్ర నష్టానికి గురైన కుటుంబాలు ఈ బిల్లులు చూసి ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగారు నిన్న ఆగష్టు నెల విద్యుత్‌ బిల్లు చెల్లింపు వాయిదా వేస్తామని ప్రకటించడం సమంజసంగా లేదు.

వేలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో ఆగష్టు నెల కరెంటు బిల్లు చెల్లింపు వాయిదా కాకుండా మాఫీ చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. దానికనుగుణంగా విద్యుత్‌ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి