
కామ్రేడ్ సీతారామ్ ఏచూరి అకాల మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి, ప్రజాతంత్ర - లౌకిక ఉద్యమాలకు తీరని లోటు. ఆయనకు నా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నాను.
కామ్రేడ్ ఏచూరి గారిని 1977లో మొదటిసారి ఢిల్లీలో చూశాను. అప్పటికి ఆయన విద్యార్థి నాయకులుగా అందరికీ సుపరిచితులు. 1984 నుండి ప్రత్యక్ష పరిచయం ఉంది. 2005 నుండి ఢిల్లీలో సెంట్రల్ సెక్రటేరియట్ మెంబర్ గా ఆయనతో సన్నిహితంగా కలసి పనిచేసీ అవకాశం నాకు లభించింది. ఆయన నాయకత్వంలో పలు ప్రజా రంగాలకు నేను సహాయపడ్డాను. ఆయన ప్రత్యక్ష మార్గదర్శకత్వంలో కేంద్ర బాధ్యతల్లో పనిచేశాను. ఆయనతో కలిసి పనిచేసిన అన్ని సందర్భాల్లో పలు జ్ఞాపకాలు, అనుభవాలు నన్ను వెన్నంటి ఉన్నాయి. వారికి నా జోహార్లు. వారి శ్రీమతి ఛీమా ఛిష్టి గారికి, కుమార్తెకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను.
వి. శ్రీనివాసరావు
State Secretary