
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటి
వైఎస్సార్‌సిపి కేంద్ర కార్యాలయంపై బిజెపి దాడికి ఖండన
తిరుపతి లడ్డు సమస్యను ఆసరా చేసుకొని బిజెపి అనుబంధ బిజెవైఎం కార్యకర్తలు వైఎస్సార్‌సిపి కేంద్ర కార్యాలయంపై దాడి చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. సంఘపరివార్ శక్తులు ఒక పథకం ప్రకారం తిరుపతి లడ్డు సమస్యను ఆసరా చేసుకొని మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. శాంతిభద్రతలను, ప్రజల మధ్య మత సామరస్యాన్ని కాపాడాలని కోరుతున్నాం.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి