భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది :02 డిసెంబర్, 2024.
కాకినాడ పోర్టు నుండి దొంగ రవాణా అవుతున్న బియ్యంపై విచారణ చేసి తక్షణం చర్యలు తీసుకోవాలి.
- సిపిఐ(యం) డిమాండ్
సబ్సిడీ మీద పేదలకు అందిస్తున్న రేషను బియ్యం గత అనేక సంవత్సరాలుగా కాకినాడ పోర్టు నుండి లక్షల టన్నుల్లో దొంగ రవాణా అవుతున్నా, ప్రభుత్వాలు చూసి చూడనట్టు పోవటం సరైంది కాదు. తక్షణం సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్య తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
పేద ప్రజలకు అందాల్సిన బియ్యం దారి తప్పి వివిధ పద్ధతుల్లో పోర్ట్‌కి చేరుతున్నాయి. ఇది రేషన్ షాపుల నుండే నేరుగా వెళుతుందా లేదా సివిల్ సప్లై ద్వారానే బియ్యం దారి తప్పుతున్నదా తెలుసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. గత వారం రోజులుగా పోర్టులో మంత్రులు హడావుడి చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఒకరిపై కూడా కేసు నమోదు కాలేదు. ఒక్కర్నీ అరెస్టు చేయలేదు. సీజ్ జేయమన్న షిప్పు కూడా ఇంత వరకు సీజ్ కాలేదు. అన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి తప్ప నిర్దిష్టంగా దొంగ రవాణా నరికట్టేందుకు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు ఆస్కారం ఇస్తుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం మాటలకి పరిమితం కాకుండా తక్షణం రేషన్ బియ్యం దొంగ రవాణాను అరికట్టి లబ్ధిదారులకు వాటిని అందేటట్లు చూడాలని, ఎక్కడినుంచి అక్రమ రవాణా అవుతుందో తెలుసుకొని దాన్ని నిరోధించాలని, దొంగ రవాణాను అనుమతిస్తున్న పోర్టు అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది.
ఈ దొంగ రవాణాను శాశ్వతంగా అరికట్టటానికి సమగ్ర విచారణ జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org