ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 04 డిసెంబర్, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని 104 విభాగంపై ఎస్మా ఎత్తివేయాలని కోరుతూ..
అయ్యా!
వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని 104 సేవలను ఎస్మా పరిధిలోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను.
తమ సమస్యలు పరిష్కరించాలని 104 ఉద్యోగులు గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. అరబిందో యాజమాన్యం అనుసరించిన ఉద్యోగ వ్యతిరేక విధానాల వలన వచ్చిన సమస్యలను పరిష్కరించాలని మీకు, వైద్య ఆరోగ్య శాఖామాత్యులకు, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా అవి ఇంకా పరిష్కారం కాలేదు.
వేతనాల బకాయిలు, పెండిరగ్ బిల్లులు, 3సంవత్సరాల ఇంక్రిమెంట్లు, పి.ఎఫ్‌లో యాజమాన్య వాటా చెల్లించాలని, స్లాబ్ ప్రకారం వేతనాలు చెల్లించాలనే న్యాయమైన కోర్కెలు కోసం ఉద్యోగులు ప్రజాస్వామ్య పద్దతిలో ఆందోళన చేస్తున్నారు. వారి కోర్కెలు తీర్చకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తానని ప్రకటించడం గర్హనీయం.
మీరు జోక్యం చేసుకుని ఎస్మా ఉత్తర్వులు ఎత్తివేసి, ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org