
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 21 జూన్, 2025.
ఆదోని ఎమ్యేల్యేపై చర్య తీసుకోవాలి.
ఈ నెల 16వ తేదీన కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం దాణాపురం సభలో సర్పంచ్‌ను అవమానించిన ఘటనపై క్షమాపణ కోరిన యంఎల్‌ఎ పార్ధసారధి ఆ పేరుతో సర్పంచ్ మతాన్ని ఉపయోగించడం మరింత దారుణం. ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి కులాన్ని, మతాన్ని బట్టి ప్రభుత్వ కార్యక్రమం నడిచే వేదికపై ప్రజాప్రతినిధి అయిన సర్పంచ్‌ను పిలవాలా వద్దా అని నిర్ణయించడం యంఎల్‌ఎగా రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి మచ్చతేవడమే. ఆ క్షమాపణలో చిత్తశుద్ధిలేదు. కావున ముఖ్యమంత్రి స్పందించి సదరు యంఎల్‌ఎ పై చర్య తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి