బివి పట్టాభిరామ్‌కు సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 జూలై, 2025.

 

బివి పట్టాభిరామ్‌కు సంతాపం

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, అభ్యుదయవాది, రచయిత బివి పట్టాభిరామ్‌ మృతి పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపాన్ని ప్రకటిస్తున్నది. ఆయన మృతి తీరనిలోటు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాము. 

ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించడానికి ఆయన ఎంతో కృషిచేశారు. చేతబడి వంటి మూఢనమ్మకాలపై ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. ఇంద్రజాలాన్ని జోడిరచి మద్యపాన నిషేదం వంటి కార్యక్రమాలకు ప్రచారం కల్పించారు. గోదావరి వరద బాధితుల కోసం ప్రదర్శనలు ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పలు పత్రికల్లో వ్యక్తిత్వ వికాస వ్యాసాలు రాశారు.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి

 

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org