సామాజిక, ప్రాంతీయ అసమానతలు లేని సమగ్రాభివృద్ధికోసం ప్రత్యామ్నాయ విధానాలతోకూడిన ప్రజా ప్రణాళికలు రూపొందిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెల 7న విజయవాడ నగరంలో రాష్ట్ర సమగ్రాభివృద్దికోసం భారీ బహిరంగ సభ జరుగుతుందని, దీనికి సిపిఎం అఖిలభారత ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతారని తెలిపారు. విజయవాడలోని ఎంబివికెలో సిపిఎం ఆధ్వర్యంలో అసమానతలు లేని అభివృద్ది కోసం ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ది, ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో ఆయన ముగింపు ఉపన్యాసం చేస్తూ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. .