April

సంక్షోభంలో వ్యవసాయరంగం:కరత్‌

మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబీవీకే), ప్రజాశక్తి బుకహేౌస్‌ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని ఐవి ప్యాలెస్‌లో '25 ఏళ్ల సంస్కరణలు - ఫలితాలు' అనే అంశంపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ మాకినేని బసవపున్నయ్య స్మారకోపన్యాసం చేశారు.సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభానికి గురైందన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గాయన్నారు. విదేశీ ఉత్పత్తులను స్వేచ్ఛగా అనుమతించటంతో దేశీయ వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లభించటంలేదన్నారు. సరళీకరణ వల్ల దేశంలో పారిశ్రామికాభివృద్ధి క్షీణించిందన్నారు. బీహెచ్‌ఈఎల్‌ వంటి సంస్థల్లో ఉత్పత్తి తగ్గినట్లు తెలిపారు.

430 కోట్లు దారి మళ్లించిన మాల్యా

బ్యాంకులకు పెద్దయెత్తున రుణాలు ఎగ్గొట్టిన కింగ్‌ఫిషర్‌ మాజీ అధిపతి విజరు మాల్యా విదేశాల్లో ఆస్తుల కొనుగోలు కోసం రూ. 430 కోట్లు అక్రమంగా దారి మళ్లించారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ఆదివారం పత్యేక కోర్టుకు తెలిపింది. ఐడిబిఐ బ్యాంకు నుంచి కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తీసుకున్న రూ.950 కోట్ల నుంచే దీనిని మళ్లించినట్లు ఇది వివరించింది. 

Pages

Subscribe to RSS - April