April

'భారత మాత'కు ఇచ్చే గౌరవం ఇదేనా?

భారత్‌ మాతాకీ జై... అనక పోతే దేశద్రోహమే అని సంఫ్‌ు పరివార్‌ అనుయా యులు ఈ మధ్య పదే పదే అంటున్నారు. దేశాన్ని తల్లిగా చూడాలా, తండ్రిగా చూడా లా? లేక తల్లితండ్రిగా చూడ కుండా వేరే పద్ధతిలో దేశ భక్తిని ప్రదర్శించే మార్గమే లేదా? అన్న చర్చ కూడా ఈ సందర్భంగా దేశంలో జరుగుతున్నది. ప్రస్తు తం ఈ చర్చల జోలికి పోవడం నా ఉద్ధేశ్యం కాదు. దేశంలోని మాతలకు (స్త్రీలను) సమానత్వం ఇవ్వకుండా, వారికి తగిన గౌరవం ఇవ్వకుండా భారత్‌ మాతాకీ జై అంటే దేశభక్తులై పోయి నట్లేనా? అన్నది నేను లేవనెత్త దలుచు కున్న చర్చ. 

25 ఏళ్ల సంస్కరణలు - ఫలితాలు

 25 ఏళ్ల సరళీకరణ విధానాల వల్ల దేశంలో అన్ని రంగాల్లోనూ అసమానతలు తీవ్రంగా పెరిగాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంతోపాటు భారత దేశానికి అనుకూలమైన సోషలిస్టు ప్రత్యామ్నాయం కోసం కృషి చేయటం ప్రజలముందున్న కర్తవ్యమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ స్పష్టం చేశారు. మార్క్సిస్టు మేథావి మాకినేని బసవపున్నయ్య తన జీవితాంతం సోషలిజం కోసం పని చేశారని, దేశంలో సోషలిస్టు ప్రత్యామ్నాయాన్ని సాధించటమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళని కరత్‌ చెప్పారు. 25 ఏళ్లలో సరళీకృత ఆర్థిక విధానాల అమలు దేశ ఆర్థిక రంగం మీదే కాకుండా రాజకీయ, సామాజిక, సాంస్కృక రంగాలన్నింటిపైనా తీవ్ర ప్రభావాన్ని చూపించాయన్నారు.

'బ్రాండిక్స్‌' వైఖరిపై భగ్గుమంటున్న మహిళా కార్మికులు

( visakha rural) ;   బ్రాండిక్స్‌ యాజమాన్యం మహిళలు పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కార్మికులు ఉద్యమించారు. చాలీచాలని వేతనాలతో సంవత్సరాలు తరబడి పనిచేస్తున్నప్పటికీ నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని బ్రాండిక్స్‌ మెయిన్‌ గేట్‌ వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. పిఎఫ్‌, గ్రాట్యూటీ, జీతాల పెంపు వంటి సమస్యలను పట్టించుకోలేదన్నారు. కార్మికశాఖ అధికారులు యాజమాన్యానికి తలొగ్గారన్నారు. పలు పర్యాయాలు జీతాలు పెంచాలని డిమాండ్‌ చేసిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం మొండి వైఖరి నశించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

నిన్న అంబేద్కర్ కి 125అడుగుల విగ్రహం కడతామని గొప్పలు చెప్పి . . . ఈరోజు రాజ్యాంగ విరుద్దంగా CRDA పరిధిలో ఇచ్చే ఉద్యోగాలకు రిజర్వేషన్స్ వర్తించవు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం దారుణం . విజయవాడలో సీపీఎం నిరశన .

నిన్న అంబేద్కర్ కి 125అడుగుల విగ్రహం కడతామని గొప్పలు చెప్పి . . . ఈరోజు రాజ్యాంగ విరుద్దంగా CRDA పరిధిలో ఇచ్చే ఉద్యోగాలకు రిజర్వేషన్స్ వర్తించవు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం దారుణం .  విజయవాడలో సీపీఎం నిరశన .

బ్రాండిక్స్‌ వద్ద రాత్రంతా ఉద్రిక్తత

visakha rural

- నిద్రహారాలు మాని ఆందోళన కొనసాగించిన మహిళలు
- బెదిరింపులకు దిగిన యాజమాన్యం
- తాగునీరు నిలుపుదల
- భారీగా పోలీసు పికెట్‌ 
- అయినా వెనక్కు తగ్గని కార్మికులు
- ఈ నెలాఖరు వరకూ గడువు కోరిన మేనేజ్‌మెంట్‌ ఆందోళన తాత్కాలిక విరమణ

రెండేళ్లయినా ఏవీ అభివృద్ధి పనులు

 (విశాఖ రూరల్)            ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్ట లేదని సిపిఎం జిల్లా నాయకులు జి.కోటేశ్వరరావు విమర్శించారు. నర్సీపట్నంలో డివిజన్‌ స్థాయి సిపిఎం కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రైతులకు గిట్టుబాటు ధర కల్పించ లేదని, కార్మికులకు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వలేదన్నారు. బ్రాండిక్స్‌ కంపెనీలో కనీస వేతనాలు ఇవ్వాలని, నర్సీపట్నం పరిసర గ్రామాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు.

ప్రమాదాల హబ్‌గా విశాఖ

పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్‌లో ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారని, ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. రేంపెక్స్‌లో ఇద్దరు, మైలాన్‌లో ఇద్దరు ప్రమాదానికి గురయ్యారని, లోహిత్‌ ఫార్మాలో బాయిలర్‌ లీకేజ్‌ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని, ఎస్‌ఇజెడ్‌ అలివెరాలోనూ ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు నివారించకుండా కోస్తా తీరమంతా ఫార్మా, పెట్రో, కార్బన్‌ తదితర విష కంపెనీలు, ప్రమాదకర కంపెనీలను ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల లాభాల కోసం స్థానికులను బలిచేయడం దుర్మార్గమన్నారు.

ఈ రోజు అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా డబగార్డెన్ వద్ద పుష్పంజిలి

ఈ రోజు అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా డబగార్డెన్ వద్ద పుష్పంజిలి గట్టించారు. ఈ సందర్భంగా సిపియం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.నరసింగరావు గారు మాట్లాడుతూ..

APలో ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం

రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌.అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కృష్ణాజిల్లా జక్కంపూడిలో ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించనున్నారు. జక్కంపూడిలో 10వేల ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు

బౌద్ధం స్వీకరించనున్న రోహిత్‌ కుటుంబం

ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్‌ వేముల కుటుంబం బౌద్ధమతం స్వీకరించనున్నట్లు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ బుధవారం తెలిపారు. గురువారం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ 125వ జయంతి సందర్భంగా రోహిత్‌ తల్లి, సోదరుడు బౌద్ధ బిక్షువుల సమక్షంలో దీక్ష స్వీకరిస్తారని పేర్కొన్నారు. 

Pages

Subscribe to RSS - April