April

నవ్యాంధ్రలో 50 నియోజకవర్గాల పెంపు..

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయన్న వార్త రావడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం నవ్యాంధ్రలో కొత్తగా 50 నియోజకవర్గాల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాబోయే కాలంలో పార్లమెంటు సమావేశాల్లో సవరణ బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు కేంద్ర సర్కారు సన్నాహాలు చేస్తోంది. దీంతో 2019 ఎన్నికల నాటికే రాష్ట్రంలో కొత్త నియోజకవర్గాలు రూపుదాల్చే అవకాశముంది. 

లోక్‌పాల్‌ నిబంధనలు పాటించాల్సిందే..

లోక్‌పాల్‌ చట్టంలోని నూతన నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ విదేశీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్ముల వివరాలను వెల్లడించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులంతా తమ జీవిత భాగస్వామి, పిల్లల విదేశీ ఖాతాల వివరాలనూ ప్రకటించాల్సిందేనని సూచించింది. 

కరవుపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

కరవుకు సంబంధించి చేపట్టిన చర్యలపై సుప్రీం కోర్టు గురువారం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్ని రాష్ట్రాల్లో కరవు నిర్వహణ విభాగాలను ఏర్పాటు చేశారని అడిగింది. జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ సంస్థలను ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీసింది. ఈ వివరాలను తనకు తెలియజేయాలని జస్టిస్‌ ఎం.బి.లోకుర్‌, జస్టిస్‌ ఎన్‌.వి.రమణలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కరవు మాన్యువల్‌, కరవు నిర్వహణ మార్గదర్శకాలపై పూర్తి వివరాలు సమర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.

Pages

Subscribe to RSS - April