August

గోల్ఫ్‌కోర్టులు,విల్లాల కోసమే భూసేకరణ..

రాజధాని కోసమే భూ సేకరణ చేస్తున్నామంటున్న ప్రభుత్వ మాటల్లో వాస్తవం లేదని సిపిఎం క్రిడా ప్రాంత కమి టీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు గురువారం విలేకరుల సమా వేశంలో విమర్శించారు. రైతుల భూములను లాక్కొని సింగ పూర్‌, జపాన్‌ తదితర కంపెనీల వ్యాపారాలకు అప్పగించ డానికే బలవంతపు భూ సేకరణని, అందుకు ముఖ్యమంత్రి బెదిరించడం అప్రజాస్వామికమని ఆందోళన వ్యక్తం చేశారు. అది గోల్ఫ్‌ కోర్టులు, ధనవంతులకు విల్లాల నిర్మాణం కోసం సేకరించే భూమి మాత్రమేనని విమర్శించారు. అభివృద్ధి కోసం భూములు సేకరించకపోతే ఏలా అని మంత్రి యనమ ల రామకృష్ణుడు అంటున్నారని, ఇది ఎవరి అభివృద్ధి కోసమని ప్రశ్నించారు.

తొలివిడతలో 5 గ్రామాల్లో 11 ఎకరాల భూసేకరణ..

రాజధాని ప్రాంతంలో భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇంతవరకు యూనిట్‌ అధికారులగా ఉన్న స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను, ల్యాండ్‌ అక్విజిషన్‌ అధికారులుగా మారుస్తూ 304 నెంబరుతో జిఓ జారీ అయింది. 9.2 అభ్యంతర పత్రాలను తిరస్కరిస్తున్నట్లు రేపటి నుండి నోటిఫికేషన్లు ఇవ్వనుంది. వీటిని ఆయా కార్యాలయాల పరిధిలో బహిరంగంగా ఏర్పాటు చేస్తారు. వీటిపై అభిప్రాయాలు చెప్పుకునేందుకు వారం రోజులు గడువిచ్చారు. వాటిని కూడా పరిష్కరించిన అనంతరం గ్రామాలవారీగా సేకరణ నోటిఫికేషన్‌ ఇస్తామని సిఆర్‌డిఎ అధికారులు చెప్పారు. అయితే గురువారం రాత్రి తొలి విడత నోటిఫికేషన్‌ విడుదలైంది.

పేదలు,విద్యార్థులపై కేసులా?

తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలో 21 మంది మహిళలతో సహా మొత్తం 49 మంది పేద రైతులపై అక్రమంగా నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఖండించారు. తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ భూమిని పేద రైతులు చాలా కాలంగా సాగు చేసుకొంటున్నారన్నారు. తప్పుడు రికార్డుతో ఒక భూస్వామి ఆ భూమిని ఈ నెల 20వ తేదీన సాగు చేసుకొనేందుకు వచ్చాడన్నారు. అతనిని పేద రైతులు అడ్డుకోగా, పోలీసులు లాఠీఛార్జితోపాటు, భూస్వామి అనుచరులు దాడి చేశారన్నారు.

CPM కేంద్రకమిటీ సమావేశాలు..

ఢిల్లీలో సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఎపి, తెలంగాణ కేంద్రకమిటీ సభ్యులు బివి.రాఘవులు, తమ్మినేని వీరభద్రం, పి.మధు ఇతర కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. దేశ రాజకీయ పరిస్థితులు, బీహార్ ఎన్నికలు, అక్టోబర్ లో జరుగనున్న ప్లీనరీపై చర్చిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. 

చింతూరులో రాస్తారోకో..

విలీన మండలాల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆద్వర్యంలో నేడు బంద్ కొనసాగుతోంది..కూన‌వ‌రం, వీఆర్ పురం, చింతూరు, ఎట‌పాక‌, కుకునూరు, వేలేరుపాడులో  సీపీఎం ఇచ్చిన పిలుపు అంద‌రినీ క‌దిలించ‌డంతో వివిధ వ‌ర్గాలు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. ముఖ్యంగా విలీనం జ‌రిగి ఏడాదిన్న‌ర గ‌డుస్తున్నా క‌నీస స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్కారం కాక ర‌గిలిపోతున్న జ‌నాల ఆగ్ర‌హం బంద్ రూపంలో వ్య‌క్త‌మ‌వుతోంది.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబురావు చింతూరులో బంద్ కార్యక్రమంలో పాల్గొని రాస్తారోకో నిర్వహించారు..

 

 

భూసేకరణకు నిరసనగా రేపు CRDA వద్ద ధర్నా:AIAWU

రాజధాని గ్రామాల్లో భూ సమీకరణకు ఒప్పుకోని రైతుల భూములను భూ సేకరణ చట్టం ద్వారా స్వాధీనం చేసుకోవాలనే ఉత్తర్వులను ఉప సంహరించాలని అఖిలపక్ష రైతు, వ్యవసాయ కార్మిక, రైతు కూలీ, ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భూ సేకరణకు నిరసనగా శుక్రవారం క్రిడా కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, ఏపి వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ నెల 20 నుంచి భూసేకరణ చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనను సమావేశం ఖండించింది. బలవంతపు భూసేకరణ ప్రయత్నాలను మానుకోవాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు డిమాండ్‌ చేశారు.

స్వయంప్రతిపత్తిలో జోక్యమెందుకు : సిపిఎం

జమ్మూ కాశ్మీర్‌కు గల ప్రత్యేక ప్రతిపత్తిని తుడిచిపెట్టేందుకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తూనే వున్నాయని, కానీ ఆ ప్రయత్నాలు ఎప్పుడూ ప్రతికూల ఫలితాలనే ఇస్తున్నాయని సిపిఎం నేత, ఎంఎల్‌ఎ మహ్మద్‌ యూసుఫ్‌ తరిగమి పేర్కొన్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని కాజిగండ్‌లో బుధవారం జరిగిన పార్టీ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆయనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గులాం నబీ మాలిక్‌, ఇతర పార్టీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలో ఈ మేరకు హామీలు పొందుపరచినప్పటికీ జమ్మూ కాశ్మీర్‌ విషయంలో మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం తన ఎజెండాను రుద్దాలని చూస్తోందన్నారు.

త్రిపురలో 300కిలోమీటర్ల పొడవునా మానవహారాలు

త్రిపుర రాష్ట్రమంతటా లక్షలాదిమంది ప్రజలు చేయి చేయి కలుపుతూ అది పెద్ద మానవ హారం నిర్మించారు. రాష్ట్రంలో 96 ప్రాంతాల నుంచి 2.25లక్షల మంది ప్రజలు 300 కిలో మీటర్ల పొడవునా బారులు తీరి మానవ హారాలు నిర్మించారు. తద్వారా వామపక్ష ఉద్యమ చరిత్రలో ఓ కొత్త మైలు రాయి నెలకొల్పారు. సిపిఎం త్రిపుర రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు ఉద్యమం ముగింపును పురస్కరించుకుని ఈ మానవ హారాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించడం గతంలో ఎన్నడూ జరగలేదు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఇందులో పాల్గొన్నారు.

Pages

Subscribe to RSS - August