August

GST నష్టదాయకం..

 జిఎస్‌టి(గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌) వ్యవస్థకు మారటం వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించటం గురించి మాత్రమే ఇప్పటి వరకు చర్చ పరిమిత మైంది. అంతర్రాష్ట్ర వాణిజ్యం జరిగినప్పుడు జిఎస్‌టిని అంతిమంగా ఉపయో గించుకునేవారు మాత్రమే కడతారు. దీనితో ఆ సరుకులను ఉత్పత్తి చేసే రాష్ట్రానికి ఎటువంటి ఆదాయం రాదు. ఇది రాష్ట్రాల ఖజానాలకు నష్టదాయకం. అంతర్రాష్ట్ర వాణిజ్యం జరగనప్పుడు కూడా ప్రస్తుత పన్ను వ్యవస్థ నుంచి జిఎస్‌టి వ్యవస్థకు మారటం నష్టదాయకమే. రాష్ట్రాలకు వచ్చే అలాంటి నష్టాలకు పరిహారం చెల్లించనున్న కాల వ్యవధి, అలాంటి నష్టాలను అంచనావేసే పద్ధతి వంటి విషయాల గురించి చర్చ జరుగుతున్నది.

బాక్సైట్ ఒప్పందాలను రద్దు చేయాలి ... త్రిపుర ఎంపి జితేంద్ర చౌదరి ..

రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలు దేశంలోని సహజ వనరులను కార్పోరేట్ శక్తులకు ధారాదత్తం చేసే దుందుడుకుగా వ్యవహరిస్తునాయి . విశాఖ గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు , గిరిజన చట్టాలకు కనీసం గౌరవించకుండా ఏకపక్షంగా రాష్ట్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్నది .దీనిపై పార్లమెంట్ లో లేవనెత్తుతానని సిపియం పార్లమెంట్ సభ్యులు జితేంద్ర చౌదరి గారు తెలియజేసారు. బాక్సైట్ ఒప్పందాలను వెంటనే  రద్దు చేయాలని డిమాండ్ చేసారు.

విలువైన సమయం వృథా..

పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు ముందుగా ఊహించిన రీతిలోనే ఎలాంటి ప్రజా ప్రయోజన అంశాలపై చర్చకు నోచుకోకుండానే ముగిసిపోయాయి. లలిత్‌గేట్‌, వ్యాపమ్‌ సంబంధిత అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభా కాలం హరించుకుపోవడమే కాక 260 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు రావాలనుకున్న భూ సేకరణ బిల్లు మొదలుకొని వస్తు సేవల పన్ను బిల్లు వరకు ఏదీ చర్చకు నోచుకోలేదు. ఇటు లోక్‌సభలోనూ, అటు రాజ్యసభలోనూ దాదాపు మూడు వారాల పాటు ప్రతిష్టంభన రాజ్యమేలింది.

కార్మిక సమ్మెకు సర్వం సిద్ధం..

సెప్టెంబర్‌ 2న 24 గంటల పాటు జరిగే సార్వత్రిక సమ్మెకు దేశంలోని అన్ని రంగాలకు చెందిన వారు సన్నద్ధమయ్యారు. 1991 నుంచి అధికార పక్షాలు చేపట్టిన నయా ఉదారవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా జరిగే 16వ సార్వత్రిక సమ్మె ఇది. 11 కేంద్ర ట్రేడ్‌ యూనియన్లు, జాతీయ సమాఖ్యలు సంయుక్తంగా చేపట్టే నాలుగవ సమ్మె ఇది. సమ్మె పూర్తి విజయవంతం అవడానికి కావలసిన అన్ని చర్యలూ తీసుకున్నట్లు దేశం నలుమూల నుంచి అందిన సమాచారం తెలియజేస్తోంది. కేంద్ర ట్రేడ్‌ యూనియన్లు: కేంద్ర ట్రేడ్‌ యూనియన్లు అన్నీ తమ జాతీయ స్థాయి సమావేశాలను నిర్వహించాయి. స్వతంత్రంగా, సంయుక్తంగా చేపట్టవలసిన కార్యక్రమాల గురించి ఉద్ధృతంగా ప్రచారం చేశాయి.

అఖిల భారత సమ్మెలు సంస్కరణలకు బ్రేకులు..

 ''ఇప్పటి వరకూ జరిగిన మానవ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే'' అని మార్క్ప్‌ మహానీయుడు నిర్వచించాడు. బానిసలు-బానిస యజమానులు, ప్యూడల్‌ ప్రభువులు-రైతాంగానికి మధ్య జరిగిన పోరాటాలు చరిత్రగతినే మార్చివేశాయి. ప్రస్తుతం నడుస్తున్న పెట్టుబడి దారీయుగంలోనూ కార్మిక వర్గపోరాటాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. భారత కార్మికవర్గం కూడా ఉన్నత పోరాట లెన్నింటినో నిర్వహించింది. 1862 హౌరా రైల్వే కార్మికులు ఎనిమిది గంటల పనికోసం ప్రారంభించిన తొలి సమ్మెతో కార్మిక వర్గం దుర్భరమైన పని పరిస్థితులపై సమరశంఖం పూరించింది.

పేదలపట్ల వివక్షతా?: బాబురావు

రాజధాని ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం కార్యకర్తలు నిత్యం పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల సిహెచ్‌.బాబురావు కోరారు. ఉండవల్లి సిపిఎం కార్యాలయంలో సోమవారం జొన్నకూటి వీర్లంకయ్య అధ్యక్షతన సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల పట్ల ఉద్ధేశ్యపూర్వకంగానే వివక్ష చూపుతుందని విమర్శించారు. అందుకు పేదలకు ఇవ్వవలసిన పింఛన్లు సరిగా ఇవ్వకపోవడమేనని విశ్లేషించారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ ఉదాసీనత రోజురోజుకు పెరుగుతుందని మండిపడ్డారు.

నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన..

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గత ఒకటో తేదీ నుంచి కొనసాగిన సిపిఎం ప్రచారాం దోళన శుక్రవారం కలెక్టరేట్లు, తహశీలుదార్లు, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద జరిగిన ధర్నాలతో పరాకాష్టకు చేరింది. ఉదయం నుంచే సిపిఎం శ్రేణులు, ప్రజలు ఆయా రెవెన్యూ కార్యాలయాలకు చేరుకొని సమస్యలపై పెద్దపెట్టున నినదించారు. అధి కారులకు వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున సాగిన ఈ ఆందోళనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధుతోపాటు రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు, రాష్ట్రకమిటీ సభ్యులు, ఆయా జిల్లాల కార్యదర్శులు, సిపిఎం శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వానికి ప్రజా సమస్యలను వివరించారు.

NDAపై అమర్థ్యసేన్‌ విమర్శలు

విద్యావ్యవస్థల్లో హిందుత్వ భావాలు జొప్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీవ్ర జోక్యం చేసుకుంటోందని ప్రఖ్యాత ఆర్థిక వేత్త అమర్థ్యసేన్‌ వాపోయారు. విద్యా సంబంధిత విషయాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసు కోవడం సర్వసాధా రణంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న రాజకీయ జోక్యానికి ఇది పరాకాష్టని అన్నారు. గతంలో యూపిఎ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకున్నప్పటికీ పరిధి దాటలేదని ఎన్‌డిఎ ప్రభుత్వం మాత్రం పదేపదే తలదూరుస్తూ బిజెపి విధానాల్ని విద్యావ్యవస్థలోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు.

నియంతృత్వ పోకడ..

శ్రీకాకుళం జిల్లా పోలాకిలో నిర్మించతలపెట్టిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్వాసితులతో మాట్లాడే ప్రయత్నం చేసిన సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి మధు అక్రమ నిర్బంధం ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వంలో పెరుగుతున్న అసహనానికి పరాకాష్ట. పోలాకికి పాతిక కిలోమీటర్ల ముందే ఆముదాలవలన రైల్వే స్టేషన్‌లోనే మధును పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకోవడం హేయమైన చర్య. పైగా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియనీయకుండా చేసేందుకు ఆయన సెల్‌ ఫోన్‌ గుంజుకోవడం, మారు మూల ప్రాంతానికి తరలించడం ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తున్నాయి.

Pages

Subscribe to RSS - August