భారత కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖుల్లో ఒకరైన కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య రేపల్లె మండం తూర్పుపాలెంలోని భూస్వామ్య కుటుంబంలో 1914 డిసెంబరు 14న జన్మించారు. తల్లిదండ్రలు చారుమతి, అప్పయ్య. భార్య జగదాంబ. కొద్దికాం సాంప్రదాయ బద్దమైన విద్యనభ్యసించారు. అనంతరం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివారు. బందరు నోబుల్ కళాశాలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1930లో దేశస్వాతంత్య్రం కోసం పోరాటం సాగించిన తరంతో ఆయన కలిసిమెసి పనిచేసి అనుభవాు పంచుకున్నారు.