December

చర్చకు రానున్న రిచా వివాదం

అలహాబాద్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షురాలు రిచాసింగ్‌ విశ్వవిద్యాలయ అధికారుల అణచివేత ధోరణులపై ధ్వజమెత్తారు. రిచాసింగ్‌ ఈ వర్సిటీలో అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళ. ఏబీవీపీ ప్రత్యర్థి రజ్‌నీశ్‌ కుమార్‌ సింగ్‌ను ఓడించి రిచాసింగ్‌ అధ్యక్ష పదవిని చేపట్టారు. విశ్వవిద్యాలయంలో జరిగే కార్యకలాపాలన్నింటిలో ఆమె ముందున్నారు. తాను విశ్వవిద్యాలయ అధికారుల తప్పుడు నిర్ణయాలకు, హిందూత్వ శక్తుల ఆగడాలకు అడ్డు నిలవడం వల్లనే తనపై పలు రూపాల్లో దాడి చేస్తున్నారని రిచా అన్నారు. పార్లమెంటులో రిచా వివాదం చర్చకు రానున్న నేపధ్యంలో కేంద్రప్రభుత్వం దిక్కు తోచని పరిస్తితులో పడింది..

 

నీరోలా మారిన నారా:రఘువీరా

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చూస్తుంటే నీరో చక్రవర్తి తీరు గుర్తుకు వస్తుందని పిసిసి అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రజలు, రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా నదిపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పాలమూరు- రంగారెడ్డి, నక్కల గండి ఎత్తిపోతల పథకాలు కృష్ణా, పెన్నా డెల్టాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అలాంటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ విధానాలను ప్రవేశపెడితే సహించం - సిపియం నక్కపల్లి డివిజన్ కార్యదర్శి ఎం.అప్పలరాజు

                        ఈ రోజు (29-12-15) రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సిపియం నక్కపల్లి డివిజన్ కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ విధానాలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పేరిట వేగవంతంగా అమలు చేస్తుందని, రాష్ర్టంలోని 8 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రతులను క్లినికల్ ఎటాచ్ మెంట్ పేరిట ప్రైవేట్ కాలేజీలకు కట్టబెడుతుందన్నారు. ల్యాబ్ టెస్ట్ లను ప్రైవేట్ కార్పోరేట్ సంస్థలకు అప్పగించడానికి జి.వో.నెం.

ప్రత్యక్ష ఎన్నికలుజరపాలి:జేసి

దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఏకవ్యక్తి పాలనలు నడుస్తున్నాయని, రాజకీయ విలువలు ఎక్కడా పాటించడం లేదని, తక్షణమే ప్రత్యక్ష ఎన్నికలు జరిపి పాలన సాగిస్తే బాగుంటుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో కుక్కల్లా కొట్లాడుతూ... అసెంబ్లీలో కాకుల్లా అరుస్తూ... ప్రజాధనాన్ని, సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు.

దాద్రీ ఘటనలో కొత్త కోణం ..

 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాద్రీ సంఘటనలో మృతుడు అఖ్లాఖ్‌(52) నివాసంలో లభించింది ఆవు మాంసం కాదని, అది మేక మాంసమని అధికారులు నిర్ధారించారు. అఖ్లాఖ్‌ ఆవు మాంసం తిన్నాడనే ఆగ్రహంతో ఒక గుంపు సెప్టెంబర్‌ 28న అతడిని హతమార్చిన విషయం విదితమే.ఈ సంఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమైంది.ఆ మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పశువైద్యశాఖాధికారులు దానిని పరీక్షల కోసం ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించారు.అక్కడ అది మాంసం కాదని, మేక మాంసమని నిర్ధారించారు. దీనిపై మృతుడి భారత వాయుసేన ఉద్యోగి సర్తాజ్‌ మాట్లాడుతూ రాజకీయ కారణాలతోనే తన తండ్రిని హత్య చేశారని ఆరోపించారు. 

జనవరి నుంచి గ్యాస్ సబ్సిడీ కట్

ఉన్నత ఆదాయ వర్గాలకు ఎల్‌పీజీ గ్యాస్‌ సబ్సిడీపై కేంద్రం కోత విధించింది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటిన వారికి గ్యాస్‌ సబ్సిడీ ఎత్తివేసింది. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. రాయితీ ఎత్తివేత జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఆదాయ వివరాలు ప్రకటించని వారికి పన్ను చెల్లింపుల ఆధారంగా సబ్సిడీని ఎత్తివేస్తామని కేంద్రం ప్రకటించింది. 

నూతన పార్లమెంట్ నిర్మించాలట..

నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని లోక్‌సభ స్పీకరు సుమిత్రా మహజన్‌ ప్రతిపాదించారు. ప్రస్తుత పార్లమెంటు ఆవరణలో కానీ, లేదా రాజ్‌పథ్‌ మార్గానికి ఆనుకుని ఢిల్లీ పోలీసు భద్రతా కార్యాలయమున్న ప్రాంతంలోగానీ నిర్మించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడుకు రాసిన లేఖలో స్పీకర్‌ పేర్కొన్నారు. లక్నోలో నిర్వహించిన భారత్‌ శాసనసభాధిపతుల సమావేశంలో మాట్లాడుతూ 1927లో అప్పటి అవసరాలకు తగ్గట్టుగా నిర్మించిన 88 ఏళ్ల నాటి ఈ భవనం సభావ్యవహారాలకు ఇక ఎంతమాత్రమూ సరిపోదని తెలియజేశారు.

జైట్లీ కాకపోతే దెయ్యాలు చేశాయ?

డీడీసీఏలో చోటు చేసుకున్న అవినీతిపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నియమించిన దర్యాప్తు కమిషన్‌ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్టు బీజేపీ పేర్కొన్నడాన్ని ఆప్‌ తప్పుపట్టింది. డీడీసీఏ అవినీతిపై ఆప్‌ నియమించిన సొంత విచారణ కమిటీనే తన నివేదికలో జైట్లీ పేరును ప్రస్తావించకపోవడంతో కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేయగా, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ దానిని తోసిపుచ్చారు.'జైట్లీ డీడీసీఏ అధిపతిగా ఉన్న కాలంలో అవినీతి జరిగింది. ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇస్తే మరి అవినీతి ఎవరు చేసినట్టు? దయ్యాలు చేశాయా?' అంటూ ప్రశ్నించారు. 

Pages

Subscribe to RSS - December