కృష్ణా: ముసునూరు తహశీల్దార్ పై దాడికి నిరసనగా జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శుక్రవారం నుంచి మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెకు వెళ్లబోతున్నారు. ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా మున్సిపల్ కార్మికుల న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను నివారించే మార్గం చూడాలి. అసలే వర్షాకాలం. మామూలుగానే దోమల ద్వారా, గాలి ద్వారా రోగాలు వ్యాపించే కాలం. దీనికి తోడు సమ్మె వలన అంటువ్యాధులు విజృంభిస్తే ఆ పాపం ప్రభుత్వానిదే అవుతుంది. మున్సిపల్ కార్మికులు ఒక రోజు విధులను బహిష్కరిస్తేనే రాష్ట్రం చెత్త కుప్పగా మారుతోంది.
రక్షణ కోసం అవసరమైతే అణుబాంబులు ఉపయోగించడానికి వెనుకాడమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ తెలిపారు. పాక్ చానల్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఆయన కుండబద్దలు కొట్టారు. ‘మమ్మల్ని రక్షించుకోవడానికి అణుబాంబులు మాకున్న అవకాశాల్లో ఒకటి. వాటిని కేవలం ప్రదర్శన కోసం మేం ఉంచుకోవడం లేదు. అయితే ఆ అవసరం ఎప్పటికీ రాకూడదని మేం భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాం. కానీ మాకే ప్రమాదం వస్తే ఉపేక్షించేది లేద’ని పరోక్షంగా భారత్‌ను హెచ్చరించారు. ఉగ్రవాదం పేట్రేగిపోతుండడం.. భారత్‌తో పరోక్ష యుద్ధానికి దారి తీయొచ్చని చెప్పారు.
వ్యాట్సప్‌ను త్వరలో నిషేధించే యోచనలో యుకే ఉంది. ఇందుకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురానుంది. వ్యాట్సప్ వినియోగదారుల మధ్య జరుగుతోన్న కోడ్ లాంగ్వేజ్ సంభాషణలను నిషేధించేందుకు ఆ దేశ ప్రధాని తీవ్ర ప్రయత్నంలో ఉన్నారు. వ్యాట్స్‌అప్, ఈ మేసేజ్, స్నాప్‌చాట్ వంటి మూడు మెస్సేజ్ సేవలను ప్రస్తుతం యూకేలో మొబైల్ వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారు. ఒకవేళ ఈ నూతన చట్టం కనుక అమలులోకి వస్తే ఈ మూడు మెసేజ్ సేవలను చట్టవిరుద్దంగా పరిగణించనున్నారు -
రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోంది. ప్రస్తుతం ఖజానా 2323 కోట్ల రూపా యల కొరతతో ఉన్నట్లు ఆర్ధిక శాఖ వెల్లడిరచిరది. ఆదాయం తగ్గు ముఖం పట్టడం, ఖర్చులు పెరిగిపోవడంతో తాజాగా వెయ్యి కోట్ల రూపాయల అప్పుకు వెళ్లాల్సి వస్తోరది. ఇది ప్రభుత్వానికి ఇబ్బరదులు కలిగిస్తోరది. ప్రతి రోజూ అనేక అత్యవసర అరశాలకు నిధులు విడుదల చేయాల్సి వస్తోందని అధికా రులు అంటున్నారు. అరదుకు తగ్గ స్థాయిలో ఆదాయం లేకపోవడం ఈ పరిస్థి తికి కారణంగా విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితిపై అర్ధిక శాఖ తాజా పరిస్థితిపై ఒక నివేదిక సిద్ధరచేసిరది.
ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వమిచ్చిన వాగ్దానం మేరకు డ్వాక్రా సంఘాలన్నింటికీ లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని, ఆధార్‌తో సంబంధం లేకుండా దీన్ని వర్తింపజేయాలని పది వామపక్ష పార్టీల రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. డ్వాక్రా మహిళల సమస్యలపై గురువారం వామపక్షాల ఆధ్వర్యాన గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలకిచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు.
జులై5న నిర్వహించిన రిఫరెండమ్‌లో గ్రీకు ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. ప్రపంచ అభ్యుదయగాముక ప్రజల్లోనూ, శ్రామిక వర్గంలోనూ ఈ తీర్పు ఎంతటి ఉద్వేగం కలిగించిందో ఏథెన్స్‌తో సహా లండన్, మాడ్రిడ్ వంటి నగరాల్లో వ్యక్తమైన హర్షాతిరేకాలే తెలియజేస్తున్నాయి. తమ జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీసే ఇయు రుణదాతల షరతులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని గ్రీకు ప్రజలు ఈ రిఫరెండం ద్వారా మరోసారి తిరుగులేని తీర్పునిచ్చారు. గత జనవరిలో జరిగిన ఎన్నికల్లో పొదుపు చర్యలకు వ్యతిరేకంగా పలు హామీలు ఇచ్చిన సిప్రాస్ నేతృత్వంలోని సిరిజా పార్టీకి వారు విజయం చేకూర్చి పెట్టారు.
గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కోడితాడిపర్రులో దశాబ్దాల తరబడి సాగుచేసుకుంటున్న తమ భూములను బలవంతంగా వేలం వేయాలని దేవాదాయశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఆరుగురు రైతుల్లో మరొకరు బుధవారం ఉదయం మృతి చెందారు.. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్న వీర్లపాటి చెత్తయ్య(70) బుధవారం ఉదయం మృతిచెందాడు. దీంతో బాధితులు మరింత ఆగ్రహంతో ప్రభుత్వాస్పత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.