July

భారత జనాభా 127,42,39,769

భారత దేశ జనాభా శనివారం నాటికి 127,42,39,769కు చేరుకుంది. శనివారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని అచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు దేశ జనాభా ఇది. దేశ జనాభా ఏడాదికి 1.6 శాతం చొప్పున పెరుగుతోందని, ఇదిలాగే కొనసాగితే 2050 నాటికి మన దేశం చైనాను సైతం దాటి పోయి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘జనసంఖ్య స్థిరతా కోశ్’ (ఎన్‌పిఎస్‌ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం చైనా జనాభా దాదాపు 139 కోట్లు ఉంది. భారత దేశంలో జనాభా చైనాకన్నా ఎక్కువ వేగంగా పెరుగుతోందని ఈ సంస్థకు చెందిన అధికారి ఒకరు చెప్పారు.

మాజీ ఎంపీ హైడ్రామా..!

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. స్థానిక సెయింట్‌పాల్‌ చర్చి మైదానంలో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ చేపట్టిన దీక్షను రెండో రోజే పోలీసులు భగ్నం చేయడం.. ఆ సమయంలో హర్షకుమార్‌ తన వద్దనున్న తుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరపడం.. వంటి ఘటనలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నగరంలో సీఎం పర్యటన కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజమండ్రి నగరంలో ముస్లింలకు షాదిఖానా, క్రైస్తవులకు శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో హర్షకుమార్‌ శుక్రవారం దీక్ష ప్రారంభించారు. దీక్షకు పలువురు కాంగ్రెస్‌, వైసీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు.

వ్యసనం

వలదు వలదన్న వాటికే మనుషులు అలవాటు పడతారు. కాదు కాదన్న వాటి చెంతకే  చేరుతారు. నిషేధిత పనుల మీదనే మనుషులకు ఆకర్షణ ఎక్కువ. సమాజం ఒప్పని పనులు చేయకూడదని తెలిసినా వాటి వైపే మొగ్గు చూపుతారు. తప్పని తెలిసినా వాటికి లొంగిపోతారు. అలవాటు అన్నది వదిలిపెట్టడానికి వీల్లేనంతగా పరిణమిస్తే వ్యసనమవుతుంది. ఆ వ్యసనానికి బానిసలయితే కోలు కోవడం కష్టం. అందువల్లనే మన పెద్దలు సప్త వ్యసనాలకు దూరంగా ఉండటం క్షేమకరమని చెప్పారు. పురాణాలు, శాస్త్రాలు చెప్పిన ఈ ఏడు వ్యసనాల్లో జూదం, మాంసభక్షణం, మద్యపానం, వేశ్యాసంగమం, వేట, దొంగ తనం, పరస్త్రీలపై లౌల్యం ఉన్నాయి. ఇవే గాక ఇతరులు మరికొన్ని వ్యసనాల గురించి ప్రస్తావించారు.

రమ్స్‌ఫెల్డ్‌కు జ్ఞానోదయం

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ నిర్దేశానుసారం ఇరాక్‌పై దాడి చేయటం ద్వారా చాలా పెద్ద పొరపాటు జరిగిందని అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి రమ్సఫెల్డ్‌ కథనం. 2003లో ఇరాక్‌పై దాడికి ఈ రమ్స్‌ఫెల్డే నాయకత్వం వహించారు. ఇన్నాళ్ళ తరవాత బహిరంగంగా ఇరాక్‌లో అమెరికా చెప్పిన ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టింప జేయటానికి బుష్‌గారి నిర్డేశాను సారం యుద్ధం మొదలబెట్టటం పూర్తిగా తప్పని ఆయన ప్రకటిం చారు. ఇరాక్‌లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పాలనే పేరిట అక్కడి అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను అధికారం నుంచి తొలగించి హత్య చేయటం అర్థం లేని, గందరగోళ చర్యని అన్నారు.

మన విద్యారంగం పయనమెటు?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలోనే కాదు, ఏదేశమేగినా ఎందు కాలిడినా మన రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడుతుంటారు. అభివృద్ధి గురించి ఆయన చెప్పే విషయాలు పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా చదువుతున్నాం. టీవీల్లో గంటల తరబడి వింటున్నాం. అభివృద్ధి అనగానే ఆయన చెప్పేది సింగపూర్‌, జపాన్‌ల గురించి. ఈ మధ్య చైనా గురించి కూడా చెబుతున్నారు. మన రాష్ట్రాన్ని సింగపూర్‌లాగా, జపాన్‌, చైనాల్లాగా అభివృద్ధి చెస్తాననే ముందు ఏ జాతి అయినా అభివృద్ధి చెందడానికి అతి ముఖ్యమైన, కీలకమైన రంగం గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. విద్యాభివృద్ధి అనేది ఆర్థికాభివృద్ధికీ, పేదరిక నిర్మూలనకూ అత్యంత కీలక విషయం.

కౌలు రైతుల భవితవ్యం ..?

రాజధాని గ్రామాల్లో కౌలు రైతుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 29 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాల్లో వ్యవసాయం ఉపసంహరణతో కౌలు రైతుల జీవనం అగమ్యగోచరంగా మారింది. రాజధాని ప్రాంతంలో మొత్తం 22 వేల మంది భూమి ఉన్న రైతులు ఉండగా వీరిలో 40 శాతం మంది రైతులు నేరుగా వ్యవసాయం చేయరు. వీరు ఎక్కువగా భూములను కౌలుకు ఇస్తారు. కొందరికి ఈ గ్రామాల్లో భూములు ఉన్నా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నివశిస్తూ ఏడాదికి ఒకటి రెండు సార్లు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తుంటారు. అలాగే మరికొందరు రైతులు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లో స్థిరపడి వారి భూములను కౌలుకు ఇస్తుంటారు.

మున్సిపల్‌ సమ్మె కొనసాగుతుంది...

మున్సిపల్‌ కార్మికులతో మంత్రులు శనివారం రాత్రి పొద్దుపొయ్యేంతవరకు రాజమండ్రిలో జరిపిన చర్చలు విఫలమైనాయి. విధిలేని పరిస్థితుల్లో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జెఎసి ప్రకటించింది. పుష్కర విధులనూ బహిష్కరించాలని, పుష్కరాలు జరుపుతున్న ప్రాంతాల్లో పర్మినెంట్‌ ఉద్యోగులతో కలిసి సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించింది. మరోవైపు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జెఎసి ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవిధక సమ్మె శనివారానికి రెండో రోజుకు చేరుకుంది. పలు జిల్లాల్లో కార్మికులు ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించి నిరసన తెలిపారు.

తహసిల్ధార్‌కు సిఎం వార్నింగ్

'అసలు నిన్నక్కడికి ఎవరెళ్లమన్నారు. నీవె వెళ్లినందువల్లే ఇంత రాద్దాంతం జరుగుతోంది. ప్రతి పక్షాలు అవకాశాన్ని తీసుకున్నాయి. అది పోలీసుల పని కదా... పోలీసులకు చెప్పి ఉంటే సరిపోయేది.' అని ముసునూరు తాహిసిల్ధార్‌ వనజాక్షినుద్ధేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నట్లు తెలిసింది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి తన నివాసంలో ఎంఎల్‌ఏ దాడి వ్యవహారం సంఘ టనపై పంచాయతీ నిర్వహించారు. ఇరువర్గాలతో విడివిడిగా మాట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమా చారం ప్రకారం ఆయన బాధిత మహిళా అధికారి తీరుపైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

వికీలీక్స్‌ వార్తలు అవాస్తవం

వికీలీక్స్‌ వెల్లడించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ట్యాపింగ్‌ కోసం సింగపూర్‌ హ్యాకింగ్‌ టీమ్‌కు ఏపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, వారి తొత్తులుగా ఉన్న చానెళ్ల కుట్ర చేస్తున్నాయని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కథనాలకు, మెయిల్స్‌కు సంబంధించి... ఏపీ ప్రభుత్వానికి సబంధంలేదని మంత్రి యనమల స్పష్టం చేశారు.

అడకత్తెరలో భారత జాతీయ బ్యాంకులు

 ప్రపంచ ఆర్థిక సంకోభ ధాటి నుండి ప్రపంచ బ్యాంకింగ్‌ వ్యవస్థను రక్షించడం కోసం బాసెల్‌ 3 ప్రమాణాలు రూపకల్పన చేయబడ్డాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించిన కారణంగా భారత రిజర్వ్‌ బ్యాంక్‌ 1-4-2013 నుండి భారత దేశంలోని జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు బేసెల్‌ 3 ప్రమాణాలను అమలుచేయాలని అదేశించింది. ఈ ప్రమాణాల అమలుతో బ్యాం కుల పరిరక్షణ ఎలాగున్నా, అదనపు మూలధన సమీకరణలో జాతీయ బ్యాంకులు జీవన్మరణ పోరాటం జరుపుతూ, అంతిమంగా ప్రైవేటీ కరణ దిశగా అడుగులు వేయాల్సిన దుర్భర పరిస్థితులను నరేంద్రమోడీ నాయకత్వంలోని యన్‌డిఎ ప్రభుత్వం కల్పిస్తున్నది.

Pages

Subscribe to RSS - July