June

బిజెపి రెండేళ్ల పాలనలో సాధించింది శూన్యం

గత ప్రభుత్వం కంటే భిన్నంగా పరిపాలిస్తామని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన బిజెపి.. తన రెండేళ్ల పాలనలో వైఫల్యాలు తప్ప సాధించిందేమీ లేదని, ప్రజలపై మరిన్ని భారాలు మోపుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లలో దేశ ఎగుమతులు 15 శాతం తగ్గి దిగుమతులు పెరిగాయన్నారు. బుడగ మాదిరి ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు బద్దలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని సాక్ష్యాత్తు ఐక్యరాజ్య సమితే తన నివేదికలో పేర్కొందన్నారు.

వీసా పాలసీ సరళీకరణ..

దేశంలోకి పెద్దఎత్తున పెట్టుబడులతో పాటు విదేశీ టూరిస్టులను ఆకట్టుకునేందుకు మోడీ సర్కార్‌ వీసా పాలసీని సరళీకరించాలని నిర్ణయించింది. పలు వీసా విభాగాలను ఏకీకృతం చేసేందుకు సంసిద్ధమైంది. బిజినెస్‌, టూరిస్టు, మెడికల్‌ వీసాను ఒక్కటిగా విలీనం చేసే ప్రతిపాదనకు హోంమంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 

25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం:విజయన్

సంప్రదాయక విధానానికి స్వస్తి చెప్పి, రాష్ట్రంలో కొత్త తరహా పాలనలో కేరళను అభివృద్ధి దిశలో నడిపేందుకు, అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు ఆ రాష్ట్ర ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రానున్న ఐదేండ్లలో ఐటీ, బయోటెక్నాలజీ, పర్యాటక రంగాల్లో కొత్తగా పది లక్షల ఉద్యోగాలను, వ్యవసాయ రంగంలో మరో 15 లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు ప్రణాళికా రచన చేస్తున్నట్టు పినరయి విజయన్‌ ప్రభుత్వం పేర్కొంది. 

Pages

Subscribe to RSS - June