రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం అనంతపురం (ఉత్తర) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ఉదయం ప్రారంభమైన 30 గంటల సత్యాగ్రహం మంగళవారం ఉద్రిక్తత నడుమ ముగిసింది. పోలీసులు, సిపిఎం నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ లక్ష సంతకాలతో కూడిన రైతుల వినతి పత్రాలను పోలీసులు నేలపాలు చేశారు. నిరసన తెలుపుతున్న నాయకులను, కార్యకర్తలను బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించారు.