2016

గుల్బర్గా దోషులకు శిక్షలు ఖరారు

గుల్బర్గా సొసైటీ ఊచకోత కేసులో దోషులకు ప్రత్యేక కోర్టు గురువారం శిక్షలు ఖరారు చేయనున్నది. ఈ కేసులో 24 మందిని కోర్టు దోషులుగా విడిచిపెట్టింది. గుజరాత్‌లో 2002లో జరిగిన ఘర్షణల సమయంలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఇషాన్‌ జాఫ్రీతో సహా 69 మంది ఊచకోతకు గురయ్యారు. ఈ కేసులో దోషులకు మరణ శిక్షకు తక్కువ కాని శిక్ష గాని, జీవిత ఖైదును గాని విధించాలని ప్రాసిక్యూషన్‌ కోర్టును కోరింది. 

అఖ్లాక్‌ హంతకులను శిక్షించండి

దాద్రీ సమీపంలోని బిసారా గ్రామంలో నిరుడు సెప్టెంబర్‌లో జరిగిన అఖ్లాక్‌ హత్యోదంతంపై మతతత్వ శక్తులు కుట్రలకు పాల్పడుతున్నాయని సీపీఐ(ఎం) విమర్శించింది. అఖ్లాక్‌ ఇంట్లో కాకుండా వేరే చోటి నుంచి సేకరించిన మాంసం నమూనా గోమాంసమేనని మథురలోని ఒక ప్రయోగశాల విడుదల చేసిందని చెబుతున్న నివేదిక ఆధారంగా ఈ కేసును ఉద్దేశపూరితంగా గోహత్య, బీఫ్‌ తినడం వైపు మళ్లిస్తున్నారని పార్టీ పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది.

దేవుడికి RSS యూనిఫాం వేసేశారు

 సూరత్‌లోని స్వామినారాయణ భగవానుడి విగ్రహం తెల్ల చొక్కా, ఖాకీ నిక్కర్‌తో దర్శనమివ్వడంతో భక్తులు తెల్లబోతున్నారు! విగ్రహాన్ని బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను పోలిన దుస్తులతో, నల్ల టోపీ, నల్ల బూట్లతో అలంకరించడంపై దుమారం మొదలైంది. సోషల్‌ మీడియాలో ఈ విగ్రహం ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

కృష్ణ‌లంక హైవే నిర్మాణంలో ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది. మూడు ప్రాంతాల‌లో స‌బ్‌వేలు, అ్ర‌పోచ్ రోడ్లు ఏర్పాటు చేయాల‌ని స్థానికులు ఆందోళ‌న‌. సి.పి.పిఎం ఆధ్వ‌ర్యంలో జాతీయర‌హ‌దారిపై రాస్తారోకో. 18మందిని అరెస్టు

కృష్ణంక జాతీయ రహదారి నుంచి ఫీడర్‌ రోడ్డుకు మూడు చోట్ల సబ్‌మే, అప్రోచ్‌ రోడ్లు ఏర్పాటు చేయాని సిపిఎం తపెట్టిన ధర్నా అరెస్ట్‌కు దారి తీసింది. కృష్ణంక సత్యం హోటల్‌ సమీపంలో బుధవారం సిపిఎం తూర్పు`1 జోన్‌ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నా అనంతరం జాతీయ రహదారిపై ఆందోళనకాయి రాస్తారోకోకు దిగారు. జాతీయ రహదారి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాస్తారోకో చేసి విరమిస్తామని సిపిఎం నాయకు చేసిన విజ్ఞప్తిని ఖాతరు చేయకుండా పోలీసు సిబ్బంది తరలి వచ్చి ఆందోళనకారును దొరికిన వారిని దొరికినట్లు అరెస్ట్‌ు చేశారు. ఈ సందర్బంగా జాతీయ రహదారిపై కొంత ఉద్రిక్తతకు దారి తీసింది.

Pages

Subscribe to RSS - 2016