August

ఆనందీ కాదు..మోడీయే కారణం:రాహుల్

గుజరాత్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై రాహుల్ గాంధీ విమర్శించారు. 'గుజరాత్ లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు 2 ఏళ్ల ఆనందీబెన్ పాలన కారణం కాదు. 13 ఏళ్ల మోదీ పాలనే కారణమ'ని  రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 

కాంగ్రెస్‌, భాజపా సభ్యులకు విప్‌ జారీ

రాజ్యసభలో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్‌, భాజపా ఆపార్టీ సభ్యులకు విప్‌ జారీ చేశాయి. బుధవారం రాజ్యసభ ముందకు వస్తుసేవల పన్ను బిల్లు రానున్న నేపథ్యంలో 3 రోజుల పాటు వరుసగా సభకు హాజరుకావాలని విప్‌ జారీ చేశాయి.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి..

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా  సిపిఎం శ్రేణులు ఆందోళన చేశారు.. టిడిపి పార్టీది అవకాశవాద రాజకీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు..కేంద్రం ప్రకటించిన ఎటువంటి హామీలు అమలు కాలేదని, ప్రతిపక్షాలు నిరసనలు..బంద్ లు చేపట్టవద్దని, జపాన్ తరహాలో చేపట్టాలని ప్రభుత్వం పేర్కొనడం జరుగుతోందని విమర్శించారు. దీనిని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారని తెలిపారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ప్రదర్శనలు చేయవచ్చు కానీ ప్రస్తుతం ప్రతిపక్షాలు నిరసనలు..ఆందోళనలు చేయవద్దా అని ప్రశ్నించారు. అవకాశ వాద రాజకీయాల మీద బతుకుతోందని తెలిపారు.

మాజీ సీఎంలకు ఎదురుదెబ్బ

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ఆరుగురికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రెండు నెలల్లోపు ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయాల్సిందిగా జస్టిస్ అనిల్ ఆర్ దవే సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.ఆదేశాలు అందుకున్నవారిలో మాజీ సీఎంలు మాయావతి, ములయాం సింగ్ యాదవ్, ఎన్డీ తివారి, కళ్యాణ్ సింగ్, రాజ్నాథ్ సింగ్, రామ్ నరేష్ యాదవ్ ఉన్నారు

ప్రత్యేక హోదా సాధనకై రాష్ట్రవ్యాప్త బంద్

ప్రత్యేక హోదా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఆగస్టు 2న జరపబోయే బంద్ లో పాల్గొనాలని కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ . నరసింగరావు ప్రజలకు  పిలుపునిచ్చారు.ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 అమలు చేయవల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కేంద్రంలో అధికారానికి వచ్చిన బిజెపి గత రెండు సంవత్సరాలు నుంచి కుంటిసాకుతో విభజన చట్టంలోని ఈ ఒక్క అంశాన్ని అమలు చేయకుండా జాప్యం చేసింది.విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ వహించడంలేదు. విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధంకావడంలేదు.

సెప్టెంబర్‌ 2 సమ్మె జ‌య్ర‌ప‌దానికై కార్మిక‌సంఘాల ఆధ్వ‌ర్యంలో స్కూట‌ర్‌ర్యాలీ

 సెప్టెంబర్‌ 2 దేశవాపితంగా కార్మికవర్గం చేపడుతున్న సార్వత్రిక సమ్మెలో కార్మిక‌వ‌ర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల‌ని సిఐటియు నాయ‌క‌త్వంలో భారీ స్కూట‌ర్ ర్యాలీ జ‌రిగింది. ఈ స్కూట‌ర్ ర్యాలీ జివిఎంసి కార్యాల‌యం వ‌ద్ద ప్రారంభ‌మై జ‌గ‌దాంబ‌, క‌లెక్ట‌ర్ ఆఫీస్‌, చౌట్రీ, పూర్ణామార్కెట్‌, కొత్త‌రోడ్‌, రైల్వేస్టేష‌న్‌, గురుద్వార్‌, హెచ్‌.బి.కాల‌నీ, వెంకోజీపాలెం, ఎం.వి.పి., మ‌ద్దిల‌పాలెం, కాంప్లెక్స్ మీదుగా జ‌గ‌దాంబ సిఐటియు కార్యాల‌యం వ‌ర‌కు జ‌రిగింది.

Pages

Subscribe to RSS - August