August

CRDA కార్యాలయానికి తాళాలు..

ఏపీ రాజధాని కోసం ప్రభుత్వం భూసేకరణను వెంటనే విరమించుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్రకార్యవర్గ సభ్యుడు బాబురావు డిమాండ్ చేశారు. గ్రామ కంఠాల పరిధిని విస్తరింపచేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ. సీఆర్డీఏ కార్యాలయాన్ని రైతు సంఘాలు, సీపీఎం నేతలు ముట్టడించారు. సీఆర్డీఏ కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. 140 ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకు సరిపోతుందన్నారు. కానీ రాజధాని పేరుతో ఇప్పటికే లక్షాపదివేల ఎకరాల సమీకరించారని అది చాలదని ఇప్పుడు మరో 3వేల ఎకరాలను సేకరిస్తోందని బాబురావు మండిపడ్డారు.

పొంచివున్న విద్యుత్‌ ఛార్జీల ముప్పు

ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ఐదేళ్ళ బకాయిలను ఇప్పుడు వసూలు చేస్తామనడం సబబు కాదు. ఇప్పుడు 2009-10 నుంచి 2013-14 వరకు ఎపిఇపిడిసిఎల్‌ రూ.1,158 కోట్లు, ఎస్‌పిడిసిఎల్‌ రూ.6,051 కోట్లు ట్రూఅప్‌ ఛార్జీలు ప్రతిపాదించారు. రెండు డిస్కాంల వాదనల్లో అనేక అంతరాలు, అసంగతాలు ఉన్నాయి. ఇఆర్‌సి అనుమతించిన దానికంటే తక్కువ విద్యుత్‌ను సరఫరా చేశారు. అలాగే కొనుగోలు చేసిన విద్యుత్‌ పరిమాణం కూడా తక్కువే. (పరిస్థితి ఇలావుండగా రానున్న ఐదేళ్లలో విద్యుత్‌ డిమాండ్‌ మూడు రెట్లు పెరుగుతుందన్న ప్రభుత్వ వాదన గాల్లో మేడలు కట్టడమే కదా!) అయినా ఖర్చు మాత్రం చాలా పెరిగిందని డిస్కాంలు వాదిస్తున్నాయి.

ఉల్లిపాయలు కౌంటర్లు పెంచాలి, ప్రతీ కుటుంబానికి కనీసం 4కేజీలు ఇవ్వాలి - సిపియం డిమాండ్

విశాఖనగరంలో ఉల్లిపాయలు ధరలు పెరగడంతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. నగరంలో కేవలం రైతు బజార్లలో మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ ఉల్లిపాయ‌లు సరఫరా చేస్తున్నది. తక్కువ కౌంటర్ల వల‌న ప్రజానీకం తీవ్ర అగచాట్లు పడుతున్నారు. రోజువారి కూలిని కూడా కోల్పోతున్నారు. తక్షణం ప్రతి రైతుబజారులో కనీసం ఐదు కౌంటర్లు ప్రారంభించాలి. ప్రతి రేషన్‌డిపోలోనూ, మున్సిపల్‌ వార్డు ఆఫీస్‌ల‌ వద్ద సబ్సిడీ ఉల్లిపాయల‌ను సరఫరా చేయాల‌ని సిపియం పార్టీ కోరుచున్నది. ప్రస్తుతం త్లెరేషన్‌కార్డుదారుల‌కి మాత్రమే ప్రభుత్వం ఉల్లిపాయులు సరఫరా చేయడం చాలా అన్యాయం. వివక్షత కూడా.

కార్మిక చట్టసవరణలు సహించం.

కార్మిక సంఘాలు, కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి సాధించు కున్న కార్మిక చట్టాలలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేస్తే సహించేది లేదని ప్రకాశం జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు అన్నారు. పోరాటాల ఫలితంగా 44 కార్మిక చట్టాలు సాధించుకున్నారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 11 రాష్ట్రాలలో కార్మిక చట్టాలలో సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా చట్టాల్లో సవరణలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జిల్లాలో పాలిషింగ్‌ యూనిట్‌లలో పనిచేసే కార్మికులు 70 వేల మంది ఉన్నారు. కార్మిక చట్టాలలో సవరణ చేస్తే 30 వేల నుంచి 40 వేల మంది కార్మికులు హక్కులను కోల్పోతారు.

ఆందోళనలో గ్రామకంఠాల ప్రజలు..

కృష్ణాయపాలెం, మందడం, మల్కాపురం, రాయపూడి, తుళ్ళూరు గ్రామాల్లోని ప్రజలు గ్రామకంఠాలపై ప్రభుత్వ తీరుపట్ల తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. సిపిఎం బృందం ఈ గ్రామంలో పర్యటించినప్పుడు వారి ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర పంట భూములు తీసుకునేటప్పుడు తియ్యని మాటలు చెప్పి నేడు గ్రామకంఠాల పేరుతో చేదు తినిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న గ్రామానికి 500మీటర్లు అదనంగా గ్రామకంఠం కింద వదులుతానన్న ప్రభుత్వ హామీ ఏమైందని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తక్షణం గ్రామకంఠాల సమస్యను పరిష్కరించకుంటే పూలు వేసిన చేత్తోనే రాళ్లు వేయక తప్పదని హెచ్చరించారు.

పోరుమామిళ్లలో సిపిఎం పోరు..

పేదల ఇళ్ళను తొలగించడానికి వస్తే ధైర్యంగా ఎదుర్కో వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.వెంకటేశ్వర్లు పేదల ను కోరారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగస ముద్రం పంచాయతీలోని 54 ఎకరాల ప్రభుత్వ బంజరు భూ ముల్లో బుధవారం వందలాది మంది పేదలు గుడిసెలు వేశా రు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సర్వే నెంబర్‌ 1263లోని 54 ఎకరాల ప్రభుత్వ బంజరులో ఇంటి స్థలం కోసం పేదలు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు నిర్లక్ష్యం వహించారని, దీంతో ఓపిక నశించి ఆ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకున్నారన్నారు. గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని ఆయన డి మాండ్‌ చేశారు.

UPA,NDA ఒకటే:నర్సింగరావు

అనకాపల్లిటౌన్‌: జిడిఎస్‌ ఉద్యోగుల వేతన సవరణను 7వ పే కమిషన్‌ పరిధిలోకి చేర్చకుండా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిరాకరించడానికి నిరసిస్తూ స్థానిక పోస్టాఫీసు వద్ద సి,డి,ఇ.డి. ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యాన బుధవారం పోస్టల్‌ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.

అవి యాజమాన్యహత్యలే:ఐద్వా

నారాయణ కళాశాల విద్యార్థినుల మృతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని ఐద్వా, విద్యార్ధి సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఐద్వా, డివైఎఫ్‌ఐలు బుధవారం విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించాయి. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ విద్యార్థినులవి ఆత్మహత్యలే ఐతే, అందుకు కారణాలేమిటో కళాశాల యాజమాన్యం వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారని, విశ్రాంతిలేని చదువులే వారి చావులకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

దళితులపై దాడులా?:KVPS

ఎస్‌పి, ఎస్‌టి మహిళలపై ఈ కాలంలో దాడులు విపరీతంగా పెరిగిపోయాయని కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కె సుబ్రమణ్యం అన్నారు.దళితులు విద్య ,వైద్యం ఉపాధి కరువైందని వీటిని అధికమించడానికి అంబేద్కర్‌ 125వ జయంత్రి సందర్భంగా ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశం నిర్వహించి దళితుల సమస్యలను చర్చించాలన్నారు.ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు సాధనకై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు.ప్రభుత్వం అవలబిస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు నర్వీర్యమైపోయి ప్రయివేటు పరంగా బలపడుతున్న తరుణంలో దళితులు బలహీన వర్గాలవారికి ఉపాధిలేక వీధిన పడుతుఉన్నారని తెలిపారు

 

చర్చలు తప్ప మరో మార్గం లేదు..

భారత్‌, పాకిస్తాన్‌ జాతీయ సలహాదారు స్థాయీ (ఎన్‌ఎస్‌ఎ) చర్చలు చివరి నిమిషంలో రద్దు కావడం బాధాకరం. ఇరు దేశాల్లోనూ శాంతికి విఘాతం కలిగించాలని కోరుకునే ఛాందసవాద శక్తులకు ఇది ఊతమిస్తోంది. నవంబరు 26 ముంబయి దాడుల తరువాత ప్రతిష్టంభనలోపడిన ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరించేందుకు జరిగిన మరో ప్రయత్నం ఇలా ఆగిపోవడం శోచనీయం. ఈ పరిణామం ఇరుదేశాల్లోని చర్చల ప్రక్రియను వ్యతిరేకించే శక్తులకు సంతోషం కలిగించవచ్చు, కానీ, ఈ ఉపఖండంలో కమ్ముకున్న అనిశ్చితిని తొలగించాలని కోరుకునేవారికి ఇది ఒక విచారకరమైన అంశం.

Pages

Subscribe to RSS - August