August

క్రమబద్దీకరణ వంద గ‌జాల‌కు పెంచాలి

1. పంచగ్రామాల‌ భూ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించింది. 2008లో దేవస్థానం 419 ఉన్న ఇళ్ళ నిర్మాణాల‌పై సర్వే చేసిన వాటి ఆధారంగా 12149 ఇళ్ళను క్రమబద్దీకరణ చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. 60చ॥గజాల వరకు ఉచితంగా, 61-300 చ॥గజాల‌ వరకు 1998 నాటి భూ మలువలో 70శాతం మరియు 9శాతం వడ్డీ, 301 చ॥గజాల‌ పైబడిన వాటికి (రెండోకేటగిరి విలువ మరియు) ప్రస్తుత భూ విలువపై గృహయజమానులు ప్రభుత్వానికి డబ్బుచెల్లించి క్రమబద్దీకరించుకోవాల‌ని ప్రభుత్వ క్యాబినెట్‌ ప్రకటించింది.

సెప్టెంబర్‌ 2 సమ్మె ఎందుకు?

ప్రపంచీకరణ నేప థ్యంలో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారీ వర్గాల ఒత్తిళ్ల వల్ల 1991 నుంచి పాలకవర్గాలు అవలంబిస్తున్న సరళీ కరణ ఆర్థిక విధానాలు, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆది నుం చీ కార్మిక సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో కార్మికవర్గాన్ని ఒక వర్గంగా ఐక్యంచేయటానికి కృషి జరుగుతున్నది. వివిధ కార్మిక సంఘాల నాయకత్వంలోని కార్మిక వర్గం ఇప్పటికే 15 సార్లు సార్వత్రిక సమ్మెలు చేసి, ఈ విధానాలను తాము తుదికంటా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. తత్ఫలితంగా ప్రయివేటీక రణ, సరళీకరణ విధానాల అమలు వేగం తగ్గింది. అయినా వాటి అమలు కోసం నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

చంద్రబాబుది హోల్‌సేల్‌ దోపిడీ..

 రాష్ట్రంలో చంద్రబాబు హోల్‌సేల్‌గాను, దిగువ స్థాయి నాయకులు రిటైల్‌గాను దోపిడీ చేస్తున్నారని పిసిసి చీఫ్‌ ఎన్‌ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులపైనా టిడిపి రౌడీలు దౌర్జన్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించారు.ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లా డుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిసుంటే రూ. 2 లక్షల కోట్లు నిధులు ఎపికి వచ్చే ఉండేవన్నారు. ఎపి విభజనతో రాష్ట్రానికి రూ. 5 లక్షల కోట్లు రావాల్సి ఉంటే, సిఎం తన ఆత్మగౌరవం తాకట్టు పెట్టి భిక్షం ఎత్తుకొంటున్నారని ఎద్దేవా చేశారు. 

పర్యాటక ప్రాజెక్టుల కోసం భూసేకరణ..

కేంద్ర పర్యాటకా ప్రాజెక్టుల కోసం ధరణికోట సత్తెనపల్లి రోడ్డులో ప్రభుత్వం 50 ఎకరాల భూ సేకరణ చేపడుతుందనే వార్తల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది.. నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరును ప్రకటించడంతో అమరావతిలో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూముల ధరలు ఎకరం సుమారు రూ.4 కోట్ల వరకు పలుకుతున్నాయి. ప్రభుత్వం భూ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే 30 లక్షల కంటే మించి పరిహారం వచ్చే అవకాశాలు లేకపోవడంతో భూ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సమ్మెతో కార్పొరేట్‌ పాలకులకు సమాధానం..

  కార్పొరేట్‌ పాలకులైన బిజెపి, టిడిపిలు కార్మిక వర్గంపై యుద్ధం ప్రకటించాయి. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి, ఉరికొయ్యలు, చెరసాలలు, ఆత్మబలిదానాలతో సాధించు కున్న కార్మిక చట్టాలను సవరించి, కార్పొరేట్‌ సంస్థలు, యాజ మాన్యాలు మరింత దోపిడీ చేసుకునే విధంగా మార్పులు చేస్తున్నాయి. కార్మిక చట్టాల సవరణ సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే... ఎటువంటి హక్కులూ, రక్షణా లేని కార్మికునిగా మార్చడం. కార్పొరేట్‌ పాలకులు కార్మిక వర్గానికి బానిస సంకెళ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు.

పెనుమాక రైతులతో సమావేశం..

ప్రభుత్వ బలవంతపు భూసేకరణను నిరసిస్తూ రాజధాని ప్రాంతం పెనుమాక రైతులతో వామపక్ష్య నాయకులు సమావేశమయ్యారు.ఈసమావేశానికి రైతులు భారీగా  తరలివచ్చారు.ఎలాంటి పరిస్థితిలో భూములు ఇచ్చేది లేదని రైతులు తేగేసి చెప్పారు. సిపియం రాష్ర్ట కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం స్వయంగా ప్రభుత్వం చేయడం సిగ్గుచెటన్నారు.ప్రభుత్వం రైతుల భూములు లాక్కోవాలని చూస్తే రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సమస్యలపై SFI సమరం..

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. అందులోభాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తత, లాఠీఛార్జి, అరెస్టులకు దారితీసింది. అరెస్టయినవారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాలి సుధీర్‌, పంపన రవికుమార్‌ తదితరులు ఉన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట విద్యార్థులు నిరవధిక దీక్షలు ప్రారంభించారు.

నేను మలాలా

మలాలా మనను స్వాత్‌ వాలికి తీసుకునిపోయింది. అక్కడి ప్లి తెమ్మెరు మనను పుకింపజేస్తాయి. ననువెచ్చటి సూర్యకిరణాు మనను పరివశింప చేస్తాయి. అందమైన ఆ ప్రకృతితో పాటు వికృతమయిన తాలిబాన్ల ఘాతుకానూ మనకు కళ్ళకు కట్టేంత సునిశితంగా చిత్రించింది. మత మౌఢ్యానికి మానవత్వానికి ఎంత దూరమో మనం ఈ ఆత్మకథలో చూస్తాం.
-కె. ఉషారాణి

- మలాలా యూసెఫ్‌జెయ్‌

వెల: 

రూ 200

పేజీలు: 

319

ప్రతులకు: 

ఐద్వా రాష్ట్ర కార్యాయం

9490098620

Pages

Subscribe to RSS - August