February

విశాఖలో పెట్రోవర్సిటీకి పర్మిషన్..

 విశాఖలో పెట్రోలియం వర్సిటీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏయూ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించేందుకు ఆంధ్రా యూనివర్సిటీతో మూడేళ్లకు కేంద్ర పెట్రోలియం సహజవనరుల శాఖ ఒప్పందం చేసుకుంది.

ఏబీవీపీ JNU నేత‌ల రాజీనామా..

ఏబీవీపీ జేఎన్యూ నేత‌లు రాజీనామా బాట ప‌ట్టారు. తాజా వివాదంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ విధానాల‌తో విబేధించిన ముగ్గురు కీల‌క నేత‌లు త‌మ రాజీనామాలు స‌మ‌ర్పించారు. ఏబీవీపీ స‌హాయ కార్య‌ద‌ర్శి ప్ర‌దీప్ నార్వాల్, క్యాంప‌స్ లోని ఓ యూనిట్ కి ప్రెసిడెంగా ఉన్న రాహుల్ యాద‌వ్, కార్య‌ద‌ర్శి అకింత్ హాన్స్ లు త‌మ ప‌ద‌వుల‌తో పాటు ఏబీవీపీ కి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

JNUSUనేతకు మద్దతుగా చెన్నైలో ఆందోళన..

జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌కు మద్దతుగా తమిళనాడు రాజధాని చెన్నైలో ఈరోజు ఆందోళనలు చేశారు. కన్నయ్య అరెస్టు, ఆయనపై న్యాయవాదుల దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆందోళన చేస్తున్న 57 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

రామ‌వ‌ర‌ప్పాడు కాలువ క‌ట్ట‌ల‌పై పేద‌ల ఇళ్ళ‌ను తొల‌గిస్తే ఊరుకోం... స‌ర్వే నిలిపివేయాల‌ని, లేని ప‌క్షంలో సి.ఎం. ఆఫీసు, క‌లెక్ట‌ర్ కార్యాల‌యాలు ముట్ట‌డిస్తామ‌ని హెచ్చ‌రిక‌.

సంఘ్ గుప్పెట్లో వర్సిటీలు..

దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలనూ తన గుప్పిట్లో పెట్టుకునేందుకు సంఫ్‌ు పరివార్‌ ప్రయత్నిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జెఎన్‌యు విద్యార్థి నాయకులను దేశ ద్రోహం కింద అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడి చేయటం మతోన్మాద చర్యేనని విమర్శించారు. బిజెపి పరివార్‌ చర్యలపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్‌ చేశారు. 

మొండిబకాయిలపై సుప్రీం దృష్టి

దేశంలో మొండిబకాయిలపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు, ఆర్ధిక సంస్థలకు 500 కోట్లకు పైగా బాకీ పడ్డవారి జాబితాను తమకు పంపించాలని సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాకు కోరింది. 6 వారాల గడువు విధించింది. వివరాలతో పాటు అఫిడవిట్‌ను కూడా పంపించాలని సూచించింది. అదే విధంగా గత ఐదేళ్లలో మాఫీ చేయబడిన భారీ మొత్తాలకు సంబంధించిన వివరాలను కూడా సుప్రీంకోర్టు కోరింది. ఈ వివరాలను సీల్డ్ కవర్‌లో తమకు అందించాలని సుప్రీం ఆర్‌బీఐని కోరింది. 

భూసేకరణపై నిరసన వెల్లువ..

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో అసైన్డ్‌ భూముల సేకరణపై నిరసన వెల్లువెత్తింది. సుమారు 500 మంది రైతులు తహసీల్దార్‌ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. మండలంలోని దూబచర్ల, పుల్లలపాడు, ముసళ్లగుంట గ్రామాల పరిధిలోని దళితులు, బిసిలకు చెందిన మూడు పంటలు పండే 150 ఎకరాల అసైన్డ్‌ భూమిని సేకరించి రక్షణరంగ విడి భాగాల తయారీ పరిశ్రమలు నిర్మించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

బీహార్‌లో రాష్ట్రపతి పాలన..

బీహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని లోక్‌ జన శక్తి (ఎల్‌జేపీ) డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందని పేర్కొంటూ నితీష్‌ కుమార్‌ ప్రభుత్వంపై మండిపడింది. ఇదే విషయమై గవర్నర్‌ రామ్‌ నాథ్‌ కోవింద్‌ను ఎన్డీయే ప్రతినిధి బృందం కలిసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఎల్‌జేపీ రాష్ట్రపతి పాలనకై డిమాండ్‌ చేయడం గమనార్హం. బీజేపీ నాయకుడు విశ్వేశ్వర్‌ ఓఝా హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కూడా రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ డిమాండ్‌ చేసింది.

దాడులకు భయపడేది లేదు:ఏచూరి

పిఎం ప్రధాన కార్యాలయం(ఎకెజి భవన్‌)పై దాడికి తెగబడిన కాషాయ మూకలు, గత రాత్రి పార్టీ కార్యాలయానికి ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగాయి..కొందరు పనిగట్టుకొని చేతకాక ఇలాంటి దాడులకు పూనుకుంటున్నారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి పేర్కొన్నారు. ఇటువంటి దాడులకు సిపిఎం భయపడదని, వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కావాలనే సిపిఎంపై దాడులకు పాల్పడతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు. చేతనైతే ప్రజాస్వామ్య యుతంగా, సైద్ధాంతికంగా చర్చకు రావాలని, అంతే తప్ప పిరికి పందల మాదిరి వ్యవహరించకూడదని హెచ్చరించారు. 

 

JNUలో నిరసనల హోరు..

జెఎన్‌యులో నిరసనల హోరెత్తాయి. గత మూడు రోజులుగా నిరసనలతో క్యాంపస్‌ అట్టుడుకుతోంది. విద్యార్థి నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ప్రభుత్వ నిరంకుశత్వ, రాజ్యాంగేతర చర్యలకు వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కారు. వీరికి ప్రొఫెసర్లు సంఘీభావం ప్రకటించారు. జాతీయత గురించి మాట్లాడే వాళ్ళు అందులో భాగమైన రాజ్యాంగం గురించి మరచిపోయారని ద్వజమెత్తారు. అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను భేషరతుగా విడుదల చేయాలని, అలాగే హిందూత్వ శక్తుల నుంచి యూనివర్శిటీని కాపాడాలని కోరుతూ విద్యార్థులు వర్శిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే సోమవారం వర్శిటీ బంద్‌ సంపూర్ణంగా జరిగింది.

Pages

Subscribe to RSS - February