February

ఆక్వాఫుడ్‌ పార్కు నిర్మాణం ఆపాలి

 ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒక్క ఇటుకను పేర్చినా ఊరుకోబోమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో బహిరంగ సభ నిర్వహించారు.ఇంట్లో పెట్టుకునే ఎసికి వినియోగించే అమ్మోనియం వాయువు కంటే లక్షల రెట్లు అధికంగా ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీల్లో ఐస్‌ తయారు కావడానికి వినియోగిస్తారని, ఆ సమయంలో గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందితే పుట్టే పిల్లలు అంగవైకల్యంతో జన్మించి పరిసర ప్రాంతాల్లో ప్రజలు బతికే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.

సీమ హామీలపై స్పష్టత ఏది? : కృష్ణయ్య

రాయలసీమ ప్రాజెక్టుల గురించి స్పష్టంగా చెప్పకపోవడాన్ని వామపక్షాల నేతలు తీవ్రంగా తప్పుపట్టారు.మదనపల్లి బస్టాండులో ఏర్పాటు చేసిన సభలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ.. వచ్చే నాలుగేళ్లలో ప్రాధాన్యతా ప్రాజెక్టుల పూర్తికి రూ.20 వేల కోట్ల వరకూ ఖర్చువుతుందని ముఖ్యమంత్రి శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారని, అయితే గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టులకు వచ్చే బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తారో స్పష్టం చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టుల మొదటి దశ, రెండో దశ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేస్తామంటూ డొంక తిరుగుడుగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.అభివృద్ధి ముసుగులో ముఖ్యమంత్రి..

పునరావాసం తరువాతే ప్రాజెక్టు పనులు

       వంశధార నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం, పరిహారం కల్పించిన తరువాతే వంశధార ప్రాజెక్టు పనులు చేపట్టాలని విపక్ష పార్టీలు డిమాండ్‌ చేశారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా, వారిని రెచ్చగొట్టే చర్యలకు దిగడం సరికాదని హితవు పలికాయి. నిర్వాసితుల డిమాండ్లు న్యాయమైనవనీ, వారు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపాయి. ఆదివారం స్థానిక క్రాంతిభవన్‌లో చౌదరి తేజేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం, కాంగ్రెస్‌, సిపిఐ, లోక్‌సత్తా, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమొక్రసీ, వైసిపి పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

ఇప్ప‌టికైనా తెలుగుదేశం ఎం.ఎల్.ఏల‌కు జ్ఞానోద‌యం మ‌యింది..... నిజంగా చిత్త‌శుద్ది వుంటే మాస్టర్‌ప్లాన్ స‌మూలంగా మార్చాల‌ని నేరుగా ముఖ్య‌మంత్రికి చెప్పాలి .

ఇప్ప‌టికైనా తెలుగుదేశం ఎం.ఎల్.ఏల‌కు జ్ఞానోద‌యం మ‌యింది.....
నిజంగా చిత్త‌శుద్ది వుంటే మాస్టర్‌ప్లాన్ స‌మూలంగా మార్చాల‌ని నేరుగా ముఖ్య‌మంత్రికి చెప్పాలి .

ఇప్ప‌టికైనా తెలుగుదేశం ఎం.ఎల్.ఏల‌కు జ్ఞానోద‌యం మ‌యింది..... నిజంగా చిత్త‌శుద్ది వుంటే మాస్టర్‌ప్లాన్ స‌మూలంగా మార్చాల‌ని నేరుగా ముఖ్య‌మంత్రికి చెప్పాలి .

ఇప్ప‌టికైనా తెలుగుదేశం ఎం.ఎల్.ఏల‌కు జ్ఞానోద‌యం మ‌యింది.....
నిజంగా చిత్త‌శుద్ది వుంటే మాస్టర్‌ప్లాన్ స‌మూలంగా మార్చాల‌ని నేరుగా ముఖ్య‌మంత్రికి చెప్పాలి .
                                                                      - సిహెచ్‌.బాబూరావు డిమాండ్ 

2016-17 విఎంసి భారాల బడ్జెట్‌ టాక్స్‌లు, పన్నుల రూపంలో రూ. 100 కోట్లు ప్ర‌జ‌ల‌పై భారాలు. అభివృద్ది పనుల్లో... సంక్షేమ కార్యక్రమాల్లో కోత .. పేద వాడల పట్ల బడ్జెట్‌లో వివక్షత అధికార టిడిపి వైఖరికి బడ్జెట్‌లో సవరణలు చేయాలి. - సి.పి.ఎం. న‌గ‌ర కార్య‌ద‌ర్

2016-17 విఎంసి భారాల బడ్జెట్‌ 
టాక్స్‌లు, పన్నుల రూపంలో రూ. 100 కోట్లు ప్ర‌జ‌ల‌పై భారాలు.
అభివృద్ది పనుల్లో... సంక్షేమ కార్యక్రమాల్లో కోత .. పేద వాడల పట్ల బడ్జెట్‌లో  వివక్షత  అధికార టిడిపి వైఖరికి 
బడ్జెట్‌లో  సవరణలు చేయాలి. -  సి.పి.ఎం. న‌గ‌ర కార్య‌ద‌ర్శి దోనేపూడి కాశీనాధ్‌ వ్లెల‌డి

రాయలసీమ సమస్యలపై బస్సుయాత్ర..

సీమ ప్రజల తరపున కేంద్రానికి తమ వాణి వినిపించేందుకు సిపిఐతో కలిసి సిపిఎం బస్సుయాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. నేడు తిరుపతిలో యాత్ర ప్రారంభమై మార్చి 5 వరకు సీమలోని నాలుగు జిల్లాల్లో కొనసాగుతుంది. నాలుగు జిల్లాల్లోనూ సిపిఎం, సిపిఐ నేతలు పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తారు. ఇదే స్ఫూర్తితో మార్చి 11న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్ట్‌ల పూర్తి, కడపలో ఉక్కు కర్మాగారం తదితర హామీలు ఏమయ్యాయో ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఆయా హామీలు ఎందుకు ముందుకు సాగడం లేదో వివరించనున్నారు.

కెకెలైన్‌తో కూడిన రైల్వే జోన్‌ ప్రకటించాలి- సిపియం

విశాఖకు కెకె లైన్‌తో కూడిన రైల్వేజోన్‌ ప్రకటించాలని సిపిఎం నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం విశాఖ రైల్వే డిఆర్‌ఎం కార్యాలయం ఎదుట సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యాన ధర్నా జరిగింది. ఈ ధర్నానుద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ, రైల్వేజోన్‌పై జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని నీరుగార్చడానికి కమిటీల పేర నాన్చుతూ బిజెపి కుట్ర పన్నిందని విమర్శించారు. రైల్వేజోన్‌పై జాప్యం ఒడిశా అభ్యంతరాల వల్ల కాదని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు.

'మాన్సాస్‌' భూములు దివీస్‌కు విక్రయంపై న్యాయ విచారణ

మాన్సాస్‌ ట్రస్టు భూములు 99 ఎకరాలు దివీస్‌ లేబొరేటరీకి విక్రయించడంపై న్యాయవిచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎన్‌పిఆర్‌ భవన్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, బీమిలి డివిజన్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను దివీస్‌కు తాకట్టుపెట్టిందని విమర్శించారు.

Pages

Subscribe to RSS - February