February

పాల‌కుల దాడిని తిప్పికొట్ట‌గ‌లిగేవి ప్రజాపోరాటాలే. పి.దివాకర్‌ వర్ధంతి సభలో సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు

పాల‌కులు అన్ని వైపుల నుండి ప్రజల‌పైన ముప్పేట దాడి చేస్తున్న నేటి తరుణంలో ప్రజల‌ను కదిలించి పోరాటాలు చేయడం ద్వారానే వాటిని ఎదుర్కొనగల‌మని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు అన్నారు. ఈ రోజు ఉదయం పాల‌ఫ్యాక్టరీ వద్ద గల‌ ఆఫీసులో కార్మికనేత సిపిఎం సీనియర్‌ నాయకు కామ్రేడ్‌ పి. దివాకర్‌ గారి 12వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ రైతు నుండి బవంతంగా భూము గుంజుకుంటున్నారు. కార్మిక హక్కును కారాస్తున్నారు.  పట్టణాల్లో ప్రజపై భారాలు పెంచుతున్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజు సంఘటితం కాకుండా చీల్చ‌డానికి కుంపట్లు రగిలిస్తున్నారు.

తమ కార్యర్తలపై దాడులకు పాల్పడ్డ రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలి:- సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి మధు

తమ కార్యర్తలపై దాడులకు పాల్పడ్డ రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన సుందరయ్యనగర్‌ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కార్యవర్గ సభ్యులు కృష్ణయ్య, రమాదేవి సందర్శించారు. మరోవైపు సీపీఎం కార్యకర్తలపై హత్యాయత్నంలో రౌడీషీటర్లు ఉపయోగించిన కత్తి, కారంపొడి ప్యాకెట్లను మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్మిస్తున్న మరుగుదొడ్లలో వీరు గుర్తించారు. స్థానిక సీఐ రౌడీషీటర్లకు మద్దతు ఇచ్చారు. టిడిపిలోని కొంతమంది బలపర్చడంతో రౌడీ షీటర్లు ఈ చర్యకు పూనుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు రౌడీ చర్యలను ప్రోత్సహిస్తున్నారు. రౌడీషీటర్లకు మద్దతు తెలపవద్దు. నేరస్తులను శిక్షిస్తే...

బాబు ఎస్సి వ్యాఖ్యలపై రగడ..

చంద్రబాబు ఎస్సీల పరంగా చేసిన వ్యాఖ్యలను కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి తప్పుబట్టింది. దళితుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు మాట్లాడారని కెవిపిఎస్‌ విజయవాడ నగర కార్యదర్శి నటరాజ్‌ విమర్శించారు. విజయవాడలోని మాచవరం సెంటర్‌లో కెవిపిఎస్‌ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్‌ దళితుడని ఇంకా ఎందరో మేథావులు దళితుల్లో ఉన్నారని అటువంటి దళిత సామాజిక వర్గాన్ని కించపరచడం సరికాదని అన్నారు.

దళితులకు అందని రాజ్యాంగ ఫలాలు..

ప్రతి భారతీయుడి కంట తడిని తుడిచివేయాలన్న స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలను నెరవే ర్చేందుకు ప్రతి పౌరునికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పిం చాలనే లక్ష్యంతో మన రాజ్యాంగం ఏర్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కులు, రాజ్యాంగ ఫలాలు దళితులకు అందాయా అని ప్రశ్నించుకుంటే ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంది. రాజ్యాంగ ఫలాలు అందక పోగా మిగతా హక్కులను కూడా గుంజుకుం టున్నారని స్పష్టమౌతోంది. దళితులు నేటికీ అమానుషమైన కులవివక్ష, అంటరానితనం, దాడులు, అవమానాలు, సాంఘిక బహిష్కరణలు, హత్యలు, అత్యాచారాలకు గురవుతున్నారు. అగ్రకుల అహంకారానికి బలౌతున్నారు. ఇష్టపడి ఆహారం తినడానికిలేదు.

జన్మభూమి కమిటీలను రద్దుచేయాలి

జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో అన్ని మండల తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహశీలార్లకు వినతిపత్రం సమర్పించారు. సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ జన్మభూమి కమిటీ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు.

సీపీఎం నాయకులపై గొడ్డళ్లతో దాడి

గుంటూరు సుందరయ్య నగర్ సీపీఎం నాయకులపై దాడి జరిగింది. సీపీఎం సుందరయ్య నగర శాఖ సహాయ కార్యదర్శిగా పని చేస్తున్నా ఆంజనేయులు, సతీష్ గొడ్డళ్లతో కోటేశ్వరరావు, బాజీ అనే వ్యక్తులు దాడి చేశారు. దాడిలో గాయపడిన ఆంజనేయులు, సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజులుగా స్థానిక సమస్యలపై సీపీఎం నేతలు పోరాటం చేస్తున్నారు. దాడికి పాల్పడిన కోటేశ్వరరావు, బాజీలతో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం.

నెట్‌న్యూట్రాలిటీ వైపే TRAI

భారత్‌లో ఫేస్‌బుక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నెట్‌ న్యూట్రాలిటీ వైపే మొగ్గు చూపింది. ఒకే సమాచారానికి వేర్వేరు ధరలు నిర్ణయించడాన్ని వ్యతిరేకించింది. నిబంధనలు ఉల్లంఘించే టెలికాం ఆపరేటర్లకు రోజుకు 50 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

ప్రజాసమస్యల పరిష్కారానికి ఛలో అసెంబ్లీ..

మార్చిలో జరిగే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో వివిధ సెక్షన్ల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చి 2 సం||రాలు కావస్తున్నా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చలేదని అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అన్ని వర్గాల ప్రజల సమస్యలను గాలికొదిలేశారన్నారు.

ట్రైమెక్స్‌పై తీవ్ర ఆరోపణలు

పాలక పెద్దల దన్నుతో ఖనిజాలను యధేచ్ఛగా దోచేస్తోందని ఈ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు శాసనసభ ప్రజాపద్దుల కమిటీయే.. ట్రైమెక్స్‌ అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు చేసింది. నిగ్గు తేలేవరకూ తవ్వకాలు ఆపేయాలంటూ ఈ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.

Pages

Subscribe to RSS - February