February

ప్రయివేటు రంగంలోనూ దామాషా పద్ధతి

ప్రయివేటు రంగంలో దామాషా పద్ధతి (జనాభా నిష్పత్తి)లో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయివేటు రంగంలో రిజర్వేషన్స్‌ పోరాట సాధన కమిటీ సలహాదారు కె.ఎస్‌.చలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్‌ ఆడిటోరియంలో ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో 'ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి' అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. కెవిపిఎస్‌ జిల్లా ప్రధానకార్యదర్శి డి.గణేష్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో కె.ఎస్‌.చలం మాట్లాడారు.

BC కమిషన్‌ లేకుండా చేర్చలేం..

బీసీ కమిషన్‌ నివేదిక ద్వారానే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కమిషన్లు లేకుండా ఇంతవరకు ఎవర్నీ బీసీల్లో చేర్చలేదని, అలా చేసినపుడల్లా న్యాయస్థానాలు సదరు రిజర్వేషన్లను కొట్టేశాయని తెలిపారు. అదే సమయంలో కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయవద్దని బీసీ నేతలను కోరారు.

23 నుంచి బడ్జెట్ సమావేశాలు..

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 23 నుంచి మార్చి 17వరకు బడ్జెట్‌ తొలి విడత సమావేశాలు, ఏప్రిల్‌ 25 నుంచి మే 13 వరకు రెండో విడత సమావేశాలు జరుగనున్నాయి. 23న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 25న రైల్వే బడ్జెట్‌, 26న ఆర్థిక సర్వే, 29న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.మరోసారి జీెఎస్టీ బిల్లును పార్లమెంట్‌లో్ ప్రవేశపెట్టనున్నారు

ఖమ్మం కార్పొరేషన్‌పైఎర్రజెండా..

నీతివంతమైన పాలనవైపే ఖమ్మం నగర ప్రజలు ఉంటారని వీరి అండతో కార్పొరేషన్‌పై ఎర్రజెండా ఎగరేస్తామని సీపీఐ(ఎం) తమ్మినేని వీరభద్రం అన్నారు.ఖమ్మం మున్సిపాల్టీ ప్రారంభం నుంచి చిర్రావూరి, అఫ్రోజ్‌ సమీనాలు నీతివం తమైన పాలన అందిం చారని, చిర్రా వూరి ఆశయాలకు అను గుణంగా ముందు కు పోతామన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని హితువుపలికారు. ఖమ్మం నగర అభివృద్ధి సీపీఐ(ఎం)తోనే సాధ్యమైందన్నారు.

ఇరకాటంలో సోలార్‌ సిఎం..

కేరళ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న సోలార్‌ కుంభకోణం  కేసు దర్యాప్తు విజిలెన్స్‌ కమిషన్‌ చేతుల్లోకి రావటం, విజిలెన్స్‌ కోర్టు మొట్టికాయలు, ఎక్సైజ్‌ మంత్రి రాజీనామా, న్యాయమూర్తిపై మంత్రి తిట్ల దండకం, విజిలెన్స్‌ కోర్టు ఆదేశాలపై హైకోర్టుస్టే, మంత్రిగారి పున్ణప్రవేశం, హోం మంత్రి రమేష్‌ చెన్నితల, ఆరోగ్య మంత్రి శివకుమార్‌పై తాజా ఆరోపణలు, ముఖ్యమంత్రి లంచాల బాగోతంపై సరిత తాజా ఆరోపణలు... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కుంభకోణం మలుపుల జాబితా అనంతంగా సాగిపోతూనే వుంటుంది. అయితే ఈ ఘటనలన్నీ అంతర్లీనంగా ఒకదాదనితో ఒకటి ముడిపడి వుండటం విశేషం.

ఢిల్లీలోనూ రాష్ట్రపతి పాలన..

రాజధానిలో కూడా రాష్ట్రపతి పాలన విధించాలనే కుట్రలో భాగంగానే బీజేపీ నాయకత్వం ఢిల్లీలో పారిశుధ్య కార్మికుల సమ్మెను ప్రోత్సహిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో న్యాయసమ్మతం కాని పద్ధతిలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిందని గుర్తు చేస్తూ ఢిల్లీ పరిధిలో కూడా అదే తరహా కుట్రలు పన్నుతోందని ఆయన అనుమానం వ్యక్తంచేసారు

హైకోర్టు తీర్పు దురదృష్టకరం:SFI

ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ సీట్ల భర్తీలో రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం లేదని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తీర్పు ఇవ్వడం దురదృష్టకరమని (భారత విద్యార్థి ఫెడరేషన్‌) ఎస్‌ఎఫ్‌ఐ పేర్కొంది. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభు త్వం తన వైఖరిని ప్రకటించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, నూర్‌మహమ్మద్‌ డిమాండ్‌ చేశారు. హైకోర్టు తీర్పు వైద్య విద్య వ్యాపారానికి మరింత అవకాశం ఇచ్చిన్నట్లు ఉందని భావించారు...

 

279 జీవో రద్దు చేయాలి..

కాంట్రాక్టర్లకు పారిశుధ్య పనులు అప్పగించే జీవో 279ని రద్దు చేయాలని కెవిపియస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ జీవో అమలు చేయాలని గుంటూరు మున్సిపల్‌ ఆర్డీ ఆదేశించడం సిగ్గు చేటన్నారు. మున్సిపల్‌ కార్మికుల్లో 97 శాతం దళిత, గిరిజన ప్రజలే ఉన్నారన్నారు. వారికి ప్రభుత్వ అండ ఉంది అని చెప్పే పాలకులు వారి జీవితాలను ప్రైవేటు కాంట్రాక్టర్లకి అప్పగించడం దుర్మార్గమని ఆందో ళన వ్యక్తం చేశారు. జీవో రద్దు చేయక పొతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రజలే తిరస్కరించాలి..

స్వాతంత్రనంతర చరిత్రలో సత్ప్రవర్తనతో ఉంటానని వ్రాత పూర్వకమైన హామీ ప్రభుత్వానికిచ్చి పనిచేస్తున్న ఒకే ఒక్క సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. సరిగ్గా 68 సంవత్సరాల క్రితం 1948 ఫిబ్రవరి 4న ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు)ను నాటి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత మరి రెండుసార్లు ఆర్‌ఎస్‌ఎస్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఒకసారి 1975 అత్యవసర పరిస్థితిలో, 1993లో బాబరీ మసీదును కూల్చినప్పుడు. పైకి ఏమి చెప్పినా, వ్రాత పూర్వకంగా క్షమార్పణలు చెప్పినా ఆర్‌ఎస్‌ఎస్‌ స్వభావంలో ఎటువంటి మార్పులేదని చరిత్ర నిరూపిస్తున్నది. ప్రస్తుతం అది మరింత శక్తివంతంగా తయారై తన ఫాసిస్టు భావజాలాన్ని విరజిమ్ముతున్నది.

Pages

Subscribe to RSS - February