January

SCనిర్ణయాన్నిసమర్థించినCPM

శబరిమలై ఆలయంలోకి మహిళలను నిషేధించడంపై సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వం, ఆలయబోర్డును ప్రశ్నించడాన్ని సిపిఎం స్వాగతించింది. 2008లో సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ అధికారంలో ఉండగా అయ్యప్ప ఆలయ ప్రవేశం కల్పించాలని కోరుతూ కొందరు మహిళలు వేసిన పిటిషన్‌కు తాము మద్దతిచ్చామని గుర్తు చేసింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ ప్రభుత్వం  పిటిషన్‌పై ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించింది. మహిళలకు ఆలయ ప్రవేశం రాజ్యాంగ హక్కని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పేర్కొన్నారు..

దళిత విద్యార్థుల సస్పెన్షన్ పైSFI

హైదరాబాద్‌లోని సెంట్రల్‌ వర్సిటీలో ఐదుగురు దళిత విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని మంగళవారం పలు చోట్ల ఆందోళనలు చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశం, దిష్టిబొమ్మల దహనం, వినతిపత్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. బండారు దత్తాత్రేయను బర్తరఫ్‌ చేయాలని, వీసీని బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు.విద్యార్థులను బహిష్కరించడం హేయమైన చర్య అని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ సభ్యులు డీ మల్లేష్‌ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. దీనికి నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

అజ్హర్‌ తలనరికితే కోటి:సేన

పఠాన్‌కోట్‌ దాడికి కారణమైన జైషే మహ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజ్హర్‌ తల నరికితే కోటి రూపాయలు నజరానా ఇస్తామని శివసేన పంజాబ్‌ యూనిట్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని శివసేన పంజాబ్‌ నేత యోగేష్‌ బతీష్‌ ఓ ప్రకనటలో పేర్కొన్నారు. జనవరి 2న పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడిలో 7గురు భారత జవాన్లు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఘటనను తీవ్రంగా ఖండించిన శివసేన.. ఆ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోటి రూపాయల ఆఫర్‌ ప్రకటన విడుదల చేసింది.

బెంగాల్‌ నుంచి తృణమూల్‌ను తరిమేయాలి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ను తరిమి కొట్టాలని వాపపక్షకూటమి మంగళవారం పిలుపునిచ్చింది. తద్వారా చిట్‌ ఫండ్‌ స్కామ్‌కు పాల్పడిన వారు అక్రమంగా దాచుకున్న ప్రజాధనాన్ని పెద్ద మొత్తంలో వెనక్కు తీసుకురావడం సాధ్యమవుతుందని లెఫ్ట్‌ నేతలు పేర్కొన్నారు. నగరంలోని ఉప్పునీటి సరస్సుకు సమీపాన ఉన్న సిబిఐ కార్యాలయం వద్ద సిపిఎం ఏర్పాటు చేసిన భారీ సభలో పాల్గొన్న పలువురు మమత ప్రభుత్వ అవినీతిని వారు నిశితంగా విమర్శించారు. టిఎంసి నాయకులు, వారి బినామీలు కలిసి ఏర్పాటు చేసిన చిట్‌ఫండ్‌ సంస్థలు ఖాతాదారులను నట్టేట ముంచాయన్నారు. 

భాగస్వామ్య సదస్సు - 2016 పేర రాష్ట్ర సంపద లూఠీ - సిపియం పార్టీ

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం- భారత పారిశ్రామిక సమఖ్య (సిఐఐ)లు సంయుక్తంగా కలిసి మూడు రోజులపాటు పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిపారు. ఈ సదస్సులో మొత్తం 328 ఒప్పందాలు జరిగాయని వీటివల్ల 4.67క్ష కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందని, 9.58 లక్ష మందికి ఉపాధి కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇసుకను భోంచేస్తున్న తెలుగుతమ్ముళ్ళు

రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ సుమారు 400 రీచ్‌లలో రూ.1.70 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. దీని ద్వారా సుమారు రూ.1000 కోట్లు ఆదాయం రావచ్చనేది ప్రభుత్వ అంచనా. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని రీచ్‌ల కోసం తమ్ముళ్లు తమ అధినాయకుల వద్ద క్యూ కడుతున్నారు. 2014 ఆగస్టు నుంచి ఇసుక రీచ్‌లను ప్రభుత్వమే నిర్వహించింది. ఏడాదిన్నరలో ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.894 కోట్ల రాబడి వచ్చింది.

రాయితీల మాట మాట్లాడని కేంద్రం..

చంద్రబాబు లక్షలకోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పిన, ఆ లక్షల కోట్లు ఆచరణలోనికి రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ పరిశ్రమలకు కల్పించే మౌలిక వసతులు, రాయితీలపైనే అవి నెలకొనే అవకాశం ఆధారపడి ఉంది. మూడురోజుల పాటు జరిగిన సదస్సుల్లో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు సహా ఏ ఒక్కరూ కేంద్రం రాయితీలు ఇస్తుందన్న ప్రకటన చేయలేదు. ముఖ్యంగా విశాఖకు రైల్వే జోన్‌ వస్తేనే పరిశ్రమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులెవ్వరూ ఈ అంశం ప్రస్తావించలేదు. దీంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో జ్యూట్‌, ఫెర్రో ఇండిస్టీ మూసివేతకు గురైంది. వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.

చంద్రన్న కానుక ఎక్కడ ?..

సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న 'చంద్రన్న కానుక' అందక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. పండుగ దగ్గర పడుతున్నా ఇంకా సరుకులు అందకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. సర్వర్లు పనిచేయకపోవడంతో ప్రజల గంటలకొద్ది క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు కానుక రూపంలో అందిస్తున్న సరుకులు నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తున్నాయి. సంక్రాంతి పండుగ కోసం ప్రభుత్వం అందిస్తున్న 'చంద్రన్న కానుక'పై నెల్లూరు జిల్లాలో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంక్రాంతి దగ్గరకు వచ్చినా కానుక అందడం లేదని ప్రజలు వాపోతున్నారు.

బలమైన సిపిఐ(ఎం)ను నిర్మిద్దాం..

ఇరవైఒకటవ పార్టీ మహాసభ ఆదేశాల మేరకు సిపిఐ(ఎం) ప్లీనం సమావేశమయింది. తన పనిని '2015 చివరికల్లా' పూర్తిచేసింది. కేవలం ఎనిమిది నెలల కాలంలో పార్టీ మహాసభ ఆదేశాలను సిపిఐ(ఎం) నెరవేర్చ గలగటం గౌరవప్రదమైన విజయం. ప్లీనం నిర్వహించటానికి ఒక సమగ్రమైన, సవివర మైన విధానాన్ని, టైంటేబుల్‌ను పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత పార్టీ నిర్మాణం, పనితీరులను గురించి రాష్ట్ర కమిటీల నుంచి విస్తృత సమాచారాన్ని సేకరించటం కోసం ఒక వివరణాత్మక మైన ప్రశ్నావళిని పార్టీ కేంద్రం రూపొందించింది.

బలవంతపు భూ సేకరణ ఆపకపోతే ఆందోళన ఉధృతం..

గ్రామాల్లోకి సర్వేయర్లను రానీయకుండా అడ్డుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రైతులకు పిలుపిచ్చారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం మాలకొండాపురం వద్ద బలవంతపు భూ సేకరణను వ్యతిరేకిస్తూ నిమ్జ్‌ రైతులు, కూలీల సదస్సు సోమవారం జరిగింది. సయ్యద్‌ హానీఫ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మధు ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూ సేకరణ ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. '2013 జిఒ ప్రకారం భూమిని తీసుకోవాలంటే నష్ట పరిహారం చెల్లించి సర్వే చేయాలి. గ్రామ సభలు పెట్టాలి. 80 శాతం మంది మెజారిటి ఆమోదం పొందాలి. ఆ తరువాత పనులు చేపట్టాలి.

Pages

Subscribe to RSS - January