January

ఇక భూసేక'రణమే'!

విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం కోసం బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఆరునూరైనా సర్వే చేయాలని అధికారులను ఉసుగొలిపింది. దీంతో, సోమవారం నుంచి సర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు. విమానాశ్రయ ప్రతిపాదిత గ్రామాల్లో సర్వేలు చేస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

పారిశుధ్య కార్మికుల పొట్టగొట్టడం దుర్మార్గం

రాష్ట్రంలోని నగర పాలక సంస్థల్లో పారిశుధ్య కార్మికుల తొలగింపునకు దారితీసే 279 నెంబరు జీవోను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మున్సిపల్‌ వ్యవహారాల మంత్రి నారాయణకు ఒక లేఖ రాశారు.

రాష్ట్రం నుంచి ఐదుగురు

అంగన్ వాడీ ఆల్ ఇండియా కమిటికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి బేబీరాణి ఉపాధ్యక్షురాలిగా, సుబ్బరావమ్మ కార్యదర్శిగా, వర్కింగ్‌ కమిటీలో వాణిశ్రీ, వీరలక్ష్మి, సుప్రజ ఎన్నికయ్యారు.

అంగన్ వాడీ జాతీయ నూతన కమిటీని ఎన్నిక

21 మందితో ఆఫీస్‌బేరర్లను, 50 మందితో వర్కింగ్‌ కమిటీని ఎన్నుకున్నారు. ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ అధ్యక్షురాలిగా పంజాబ్‌కు చెందిన ఉషారాణి, ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన ఏఆర్‌ సింధు ఎన్నికయ్యారు.

 

పోలీసు పహారా మధ్య 'జన్మభూమి'

'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై అధికారులను నిలదీస్తూనే ఉన్నారు. దీంతో అధికార యంత్రాంగం పలుచోట్ల పోలీసు పహారా ఏర్పాటు చేసి సభలను నిర్వహిస్తున్నాయి. సభల్లో సమస్యలపై ప్రస్తా విస్తున్నవారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటు న్నారు. దీంతో అనేకచోట్ల నిరసనకారులకూ, టిడిపి నేతలకూ మధ్య వాగ్వివాదాలు కొనసాగుతున్నాయి.

సంక్రాంతికీ లేని 'మాఫీ'

ఎన్నికల్లో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. అనంతరం అనేక కోతలు, నిబంధనలు విధించి మాఫీని కొన్ని నెలలపాటు సాగదీసింది. రూ.50 వేల నుంచి లక్షన్నర లోపు రుణాలను ఐదు విడతల్లో ఏడాదికి 20 శాతం చొప్పున మాఫీ చేస్తానని పేర్కొంది. అనేక వడపోతల అనంతరం సుమారు 54 లక్షల రైతులు మాఫీకి అర్హత సాధించారు.

రబీ సాగేనా

రబీని ఏటా నీటి కొరత వెంటాడుతోంది. ప్రభుత్వానికి ముందుచూపు కొరవడ టంతోపాటు, రైతులను గందరగోళ ప్రకటనలతో అయోమయానికి గురిచేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 4.09 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ప్రభుత్వం రెండు నెలల క్రితం ప్రకటించింది. నెల రోజుల తర్వాత '3.49 లక్షల ఎకరాలకే నీరిస్తాం.

తపాలా సేవలు 'బహుళజాతి' సంస్థల పరం

ప్రతిష్టాత్మకమైన భారత తపాలా సేవలు బహుళజాతి సంస్థల పరం కాబోతున్నాయి. ఐసిఐసిఐ, సిటీ బ్యాంక్‌ వంటి మొత్తం 40 బహుళజాతి ఆర్థిక సంస్థల కోసం భారత తపాలాశాఖ తలుపులు బార్లా తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మార్చ్ లో రెండు వేల ఇళ్ల తొలగింపు..

రాజధాని నగర ప్రాంతంలో 2 వేల నివాసాలు తొలగించాల్సి ఉంటుందని అంచనా వేశారు. అందుకు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. తొలగించాల్సిన ఇళ్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమూ ఉంది. వచ్చే మార్చిలో ప్రధాన అనుసంధాన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో, ఆలోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. రోడ్ల నిర్మాణం, ల్యాండ్‌ స్కేపింగ్‌ తదితర పనులకు మెకన్సీ సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీని ఆధారంగా పనులు చేపట్టనున్నారు. ఈలోపే రోడ్డు వెళ్లే సర్వే నెంబర్లలో ఉన్న ఇళ్ల తొలగింపు ప్రక్రియ చేపట్టే ఉద్దేశంతో ప్రభుత్వముంది. 

Pages

Subscribe to RSS - January