గత సంవత్సర కాలంగా 9/77 అసైన్డ్ చట్ట సవరణపై చర్చ జరుగు తున్నది. ముఖ్యమంత్రి, మంత్రులు నిరంతరం ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. త్వరలో ఈ చట్టాన్ని సవరిస్తామని, అసైన్డ్ భూములకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని కలెక్టర్లకు ఉత్తర్వులు అందినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చట్ట సవరణపై చర్చిస్తామని ముఖ్య మంత్రి ప్రకటించటంతో మరీ వేడెక్కింది. ఈ చట్టం ఉద్దేశం ఏమిటి? ఎవరి రక్షణ కోసం ఈ చట్టం వచ్చింది? ఇప్పుడు ఈ చట్టాన్ని ఎందుకు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉబలాట పడుతోందనేదాన్ని పరిశీలించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం 9/77 చట్టాన్ని సవరించింది.