June

తుని ఘటనపై వేధించొద్దు..

తుని ఘటనపై ప్రజలను వేధించ వద్దని టీడీపీ ప్రభుత్వానికి అమలాపురం మాజీ ఎంపీ జి.వి. హర్షకుమార్ సూచించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జి.వి.హర్షకుమార్ మాట్లాడుతూ... అధికారం మారితే కేసులు మాఫీ అయిపోతాయన్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడ వద్దని టీడీపీ నేతలకు హర్షకుమార్ హితవు పలికారు.

లాలూని రక్షించేపనిలో నితీష్..

బిహార్ మత్స్య, పశు సంవర్థక శాఖ కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు మాయమైనట్టు వార్తలు వెలువడ్డాయి. ఇవి దాణా కుంభకోణానికి సంబంధించినవని ఆరోపణలు వస్తున్నాయి. ఫైళ్లు మాయమైన ఘటనపై పట్నాలోని పాత సచివాలయం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.బిహార్ లో ప్రస్తుతం జేడీయూ, ఆర్జేడీ కూటమి అధికారంలో ఉంది. దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ను రక్షించేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.

బాబూ ..దీక్ష ఢిల్లీలో చెయ్యి ..

సిపిఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజనను కోరాయని, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారంటూ గొంతు చించుకుంటున్న చంద్రబాబు రెండుసార్లు విభజనకు అనుకూలంగా లేఖలిచ్చారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గుర్తు చేశారు. ఈ విషయాన్ని మరుగుపడేసి, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారంటూ ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు.2008 అక్టోబర్‌ 18, తర్వాత 2012 డిసెంబర్‌ 27న ప్రణబ్‌ ముఖర్జీ, సుశీల్‌కుమార్‌ షిండేకు చంద్రబాబు ఇచ్చిన లేఖలను బహిర్గతం చేశారు. 

Pages

Subscribe to RSS - June