March

పీడిత ప్రజల పక్షాన పోరాడిన యోధుడు శివారెడ్డి

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పీడిత ప్రజల పక్షాన పోరాడిన మహా యోధుడు సింహాద్రి శివారెడ్డిని ఆయన ఆశయబాటలో నేటి యువతరం పనిచేయాలని సిపిఎం జిల్లాకార్యదర్శి పాశం రామారావు అన్నారు. గురువారం అమరావతి తల్లం బ్రహ్మయ్య స్మారక భవన్‌లో నిర్వహించిన శివారెడ్డి సమస్మరణ సభకు ఆయన హాజరై మాట్లాడారు. 1928లో ఖాజా గ్రామంలో ధనిక కుటుంభంలో పుట్టిన శివారెడ్డి ఆ ప్రాంతం రైతాంగ సమస్యల కోసం 1944లో గ్రామంలో రైతుసంఘం ఏర్పాటు చేశారన్నారు. ఆ తరువాత 1946లో పార్టీ శాఖ ఏర్పాటు చేశారన్నారు. గ్రామంలోను, మంగళగిరి ప్రాంతంలోను జిల్లాలో అనేక సమస్యలపై పోరాటాలు చేశారన్నారు. పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారని తెలిపారు.

అగ్ని ప్రమాద బాధితులకు సిపిఎం సాయం

మండలంలోని విఠంరాజుపల్లిలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుంటుంబాలకు సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో వంటసామగ్రిని, దుస్తులను శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్‌ కార్యదర్శి కె.హను మంతరెడ్డి మాట్లాడుతూ అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పక్కా గృహాలు మంజూరు చేయటంతో పాటు ప్రమాదంలో పంటను కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు భోజనప్లేట్లు, చెంబులు, గ్లాసులు, టిఫిన్‌ బాక్స్‌లు అందించారు. ఎంపిటిసి సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస రడ్డి దుస్తులు, వంటసామాగ్రి, దుప్పట్లు పంపిణీ చేశారు.

బలవంతపు భూసేకరణను అడ్డుకుంటాం

   ప్రజా ఉద్యమం తప్పదు : సిపిఎం
        ప్రభుత్వం మొండిగా వ్యహరించి రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొనేందుకు సిద్ధపడితే ప్రజా ఉద్యమం తప్పదని సిపిఎం నక్కపల్లి డివిజన్‌ కన్వీనర్‌ ఎం.అప్పలరాజు హెచ్చరించారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు కోర్టును ఆశ్రయించారని, కోర్టు తీర్పు అనంతరం చట్ట ప్రకారం గ్రామ సభలు పెట్టి ప్రభుత్వం తన ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సామాజిక ప్రభావ నివేదికను బహర్గతం చేయాలన్నారు. అవేమి లేకుండా ప్రభుత్వ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.         

Pages

Subscribe to RSS - March