March

విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం తప్పుబట్టింది. ప్రజలపై భారాలు మోపడం సరికాదని పేర్కొంది. ఈ ఛార్జీల పెంపును సీపీఎం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది. ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని, పెద్ద పెద్ద కంపెనీలపై పన్నులు వేసి డబ్బులు వసూలు చేస్తే ఛార్జీలు పెంచాల్సినవసరం లేదన్నారు. నాలుగు శాతం అనేది చాలా ఎక్కువని, ఛార్జీలు పెరగడం వల్ల ప్రతి వస్తువు ధర కూడా పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి మిగులు విద్యుత్ ఉండడమే కాకుండా 24గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చన్నారు.

క‌నీస వేత‌నం అడిగితే ఇలా అక్ర‌మ అరెస్టులా? ఇదేమి ప్ర‌జాస్వామ్యం? పోలీసుల‌తో ప్రభుత్వ పాల‌నా సిగ్గు, సిగ్గు!!

 క‌నీస వేత‌నం అడిగితే ఇలా అక్ర‌మ అరెస్టులా?  ఇదేమి ప్ర‌జాస్వామ్యం?  పోలీసుల‌తో ప్రభుత్వ పాల‌నా సిగ్గు, సిగ్గు!!

క‌నీస వేత‌నం అడిగితే ఇలా అక్ర‌మ అరెస్టులా? ఇదేమి ప్ర‌జాస్వామ్యం? పోలీసుల‌తో ప్రభుత్వ పాల‌నా సిగ్గు, సిగ్గు!!

 క‌నీస వేత‌నం అడిగితే ఇలా అక్ర‌మ అరెస్టులా?  ఇదేమి ప్ర‌జాస్వామ్యం?  పోలీసుల‌తో ప్రభుత్వ పాల‌నా సిగ్గు, సిగ్గు!!

JNUని మూసేందుకే కుట్ర..

తనపై ఎన్ని కేసులు పెట్టిన బయపడేది లేదని, జెఎన్‌యు విద్యార్థి ఉద్యమ వారసత్వం తనకు అట్లాంటి ధైర్యాన్ని ఇచ్చిందని తీహార్‌ జైల్‌ నుంచి విడుదల అయిన జెఎన్‌యు ఎస్‌యు అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ పేర్కొన్నారు. ఆ రోజు(ఫిబ్రవరి 9)న జెఎన్‌యులో ఎవరూ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేదని, ఎబివిపి సహాయ కార్యదర్శి ముందుస్తు ప్రణాళికతోనే, జి న్యూస్‌ చానల్‌ను తీసుకొచ్చి తప్పుడు వీడియోలు సృష్టించారని ఆరోపించారు. జెఎన్‌యు డిఎన్‌ఎలోనే అట్లాంటి ఆలోచన లేదని కానీ బిజెపి ప్రభుత్వం జెఎన్‌యుపై కక్షకట్టి ఈ ఘాతుకానికి వడిగట్టిందన్నారు.

అంగన్‌వాడీలకు భారీ కోత..

మోడీ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాదీ మాతాశిశుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేటాయింపుల్లో అంగన్‌వాడీలకు భారీ కోతలు విధించింది. గతేడాదితో పోల్చితే సుమారు రూ. 5,500 కోట్లు(7 శాతం) తగ్గించింది. 2015-16కు గానూ రూ.15,483.77 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేవలం రూ.14 వందల కోట్లతో సరిపెట్టింది.

లోక్ సభలో ఆధార్ రగడ..

ప్రభుత్వ పథకాలన్నిటికీ ఆధార్‌ కార్డును అనుసంధానించడాన్ని చట్టబద్దం చేయడానికి లోక్‌సభలో కేంద్రం ఆధార్‌ బిల్లును గురువారం ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎమ్‌.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఈ బిల్లు ఆమోదం పొందితే రూ.20 వేల కోట్ల వృథాని అరికట్టొచ్చని చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ కూడా ఎన్‌ఐడిఎఐ బిల్లుపేరుతో దీన్ని ప్రవేశపెట్టిందని కాంగ్రెస్‌ నాయకుడు మల్లిఖార్జున్‌ ఖర్గే అన్నారు. దీనకి జైట్లీ వివరనిస్తూ 'ఇది కాస్త భిన్నమైంది. ఇది స్వతహాగా ప్రభుత్వ చెల్లింపులకు మాత్రమే పరిమితమౌతుంది' అని చెప్పారు.

విద్యుత్‌ ఛార్జీలు పెంచితే ఆందోళన ఉధృతం

       విద్యుత్‌ ఛార్జీలు పెంచితే ఆందోళన ఉధృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు హెచ్చరించారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యాన కార్యకర్తలు, ప్రజలు గురువారం ఇపిడిసిఎల్‌ కార్యాలయం ధర్నా నిర్వహించారు. దీనికిముందు ద్వారకానగర్‌ కూడలి నుంచి ఎపిఇపిడిసిఎల్‌ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలకు రాయితీలిస్తూ వినియోగదారులపై ఛార్జీల మోపి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఆరిలోవ కొండవాలు ప్రాంతంలోని బిఎన్‌ఆర్‌ నగర్‌లో 400 ఇళ్లకు విద్యుత్‌ సరఫరా లేదన్నారు.

'దివీస్‌' బాధిత సాగుదారులకు నష్టపరిహారమివ్వాలి

                 భీమిలి మండలంలోని దివీస్‌ లేబొరేటరీస్‌ స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించి బాధిత భూ సాగుదారులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. సమస్య పరిష్కారమయ్యే వరకూ ఆ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కోసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు వివి.శ్రీనివాసరావులు గురువారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ వివరాలు....

మార్ఫింగ్‌ వెనుక స్మృతి..

జేఎన్‌యూలో 'దేశద్రోహం' అనే భూతాన్ని సృష్టించి, దేశవ్యాప్తంగా ఉన్మాదం రెచ్చ గొట్టడం వెనుక జరిగిన కుట్రలు ఒకటొక్కటిగా బైటి కొస్తున్నాయి. దీని వెనుక సూత్రధారులెవ్వరో ఆలస్యం గానైనా సరే నగంగా ముందు కొస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ సంస్థ మొత్తం ఏడు వీడియోల్లో రెండింటిని మార్ఫింగ్‌ చేసినట్టు ప్రకటిం చిన విషయం తెలిసిందే. వాటిలో ఒక వీడియోను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేసింది శిల్పి తివారీ అని ఇప్పుడు బైటపడింది. ఈమె మరెవ్వరో కాదు స్వయంగా హెచ్‌ఆర్‌డీ మంత్రి స్మృతి ఇరానీకి సన్నిహితురాలన్న నిజం కూడా వెలుగులోకి వచ్చింది.

Pages

Subscribe to RSS - March