March

మోడీ గడ్డపై హెచ్‌సియు నిరసన..

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ(హెచ్‌సియు) ఘటనపై ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. దేశ, అంతర్జాతీయ విద్యా వర్గం ఈ ఘటనపై మండిపడింది. మోడీ సొంత రాష్ట్రం(గుజరాత్‌)లో హెచ్‌సియు విద్యార్థులకు మద్ధతుగా సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ గుజరాత్‌ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్లూ, నల్సర్‌ యూనివర్శిటీల్లో కూడా హెచ్‌సియుకి మద్ధతుగా వివిధ రూపాల్లో సంఘీభావం తెలిపారు. 

విమర్శల నేపథ్యంలో బరిలోకి అమిత్‌షా

 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా రెండు రోజుల క్రితం తొలిసారిగా బెంగాల్‌ వెళ్లిన ప్రధాని నరేంద్రమోడి అక్కడి అధికారపక్షాన్ని (తృణమూల్‌)ను మాటమాత్రం అనకుండా వామపక్ష కూటమిపై దాడి ఎక్కుపెట్టారు.ఈ విషయం బెంగాల్‌లో చర్చనీయాంశంగా మారడంతో  పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ధైర్యముంటే నారదా స్టింగ్‌ ఆపరేషన్‌లో లంచాలు తీసుకుంటూ పట్టుబడిన తృణమూల ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలని బిజెపి అధ్యక్షులు అమిత్‌షా మంగళవారం సవాల్‌ విసిరారు. మమత అధికారంలోకి వచ్చిన తరువాత బాంబుల మోత తప్ప సంగీతం వినిపించడం లేదని ఆయన అన్నారు.

ముగిసిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ సమావేశాలు ఆరంభంనుంచి గందరగోళ పరిస్థితుల మధ్యే జరిగాయి. పలుమార్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమావేశాలనుంచి వాకౌట్‌ చేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాజకీయ డ్రామాలే తప్ప ప్రజా సమస్యలు, శాసన సభ నియమ నిబంధనలు అవసరం లేకుండా పోయాయని విమర్శలు వెల్లువెత్తాయి. 

సిక్కుల ఊచకోతపై JNU కన్హయ్య..

జవహర్లాల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 1984 సిక్కుల ఊచకోతకూ, 2002 గుజరాత్ మారణహోమానికీ తేడా ఉందని పేర్కొంటూ కన్హయ్య చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. 1984 సిక్కుల ఊచకోత ఒక గుంపు పాల్పడితే...2002 గుజరాత్ మారణ హోమం వెనుక సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. అయితే కన్హయ్యకుమార్ వ్యాఖ్యలపై ఆయన మద్దతు దారులు సైతం విమర్శలు గుప్పించడంతో డిఫెన్స్ లో పడిన ఆయన తన మాటలను తప్పుగా అన్వయించారని వివరణ ఇచ్చారు. 

అజ్ఞాతం వీడిన లెఫ్ట్‌ కార్యకర్తలు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండతో తృణమూల్‌ అరాచక శక్తులు చెలరేగిపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన పలువురు వామపక్ష కార్యక్తలు ఎన్నికల నేపథ్యంలో బయటకు వస్తున్నారు. ఎర్రజెండా సాక్షిగా పోరాటం కొనసాగిస్తామని ప్రతిన చేస్తున్నారు. ఇలా వస్తున్న వారు గతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు బలవంతంగా ఆక్రమించుకున్న తమ సంఘాల కార్యాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు.

Ap అసెంబ్లీ స్థానాల పెంపు..?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంచడంపై కేంద్ర హోంశాఖలో భిన్నాభి పాయాలున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమక్షంలో ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏకాభిప్రాయం సాధించేందుకు వివిధ మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమై నట్లు తెలిపారు. వీలైనంత త్వరలో అసెంబ్లీ స్థానాల పెంపు ప్రక్రియ పూర్తి కావస్తుందని చెప్పారు. 2026 వరకు అసెంబ్లీ స్థానాలు పెంచనవసరం లేదని ఏపి పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్‌ 26 పేర్కొంది.

రాజధానిలో సంస్కృతి జాడ గల్లంతు..

 అమరావతి.. అదొక ప్రాచీన నగరం. శాతవాహనుల కాలంలో అదే రాజధాని. బౌద్ధానికీ ఆ ప్రారతం నాడు కీలక స్థానం. అలాంటి అమరావతి నేడు రాష్ట్రానికి రాజధానిగా మారి, తన ఉనికినే కోల్పోయే పరిస్థితి నెలకొరది. చారిత్రక ప్రాముఖ్యం గల ఆ ప్రారతం ఆధునిక కట్టడాలు రానున్నాయి. గత వైభవం చరిత్రకే పరిమితం కానుంది. 

ముగిసిన అనంతపురం జిల్లా ప్లీనం

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో రెండ్రోజుల పాటు జరిగిన సిపిఎం జిల్లా ప్లీనం మంగళవారం ముగిసింది. రెండో రోజు సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత 14 నెలల్లో చేపట్టిన పోరాటాలను సమీక్షించుకుని, రాబోయే ఏడాది కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యచరణను రూపొందించారు. రెండు రోజుల ప్లీనంలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు కల్పించాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని, తదితర ఎనిమిది అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు.

రాష్ట్రపతి పాలనపై బిజెపి సమర్ధింపు..

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. హరీష్‌ రావత్‌ ప్రభుత్వం మార్చి 18న మెజార్టీని కోల్పోయినప్పటికీ అధికారంలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం, అనైతికం అని, ఆర్టికల్‌ 356ను అమలు చేయడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏదీ ఉండదని కేంద్రం పేర్కొంది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్‌ పేర్కొనడంపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తీవ్రంగా స్పందించారు.

లెఫ్ట్ తో ప్రజా సంక్షేమ కూటమి..

వామపక్షాలు, డిఎండికె, విఎస్‌కె, ఎండిఎంకె సంయు క్తంగా ఏర్పడిన ప్రజా సంక్షేమ కూటమి ఈ నెల 31న అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. డిఎండికె 124, వామపక్షాలకు 35, ఎండిఎంకెకు 40, విఎస్‌కెలకు 35 సీట్లను సర్దుబాటు చేసుకున్న విషయం విదితమే. ప్రజా సంక్షేమ కూటమి.. కెప్టెన్‌ కూటమిగా ప్రచారం కావడంతో వామపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రజా సంక్షేమ కూటమిగానే ఉండాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జి.రామ కృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌ పట్టుబట్టారు. ఆదివారం చెన్నరుకి వచ్చిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి..

Pages

Subscribe to RSS - March