May

మళ్లీ చింతమనేని హల్‌చల్‌

దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కొల్లేరు అభయారణ్యం నడిబొడ్డున అక్రమంగా రహదారి నిర్మాణం ఈసారి వివాదానికి కారణమైంది. జిల్లా అటవీశాఖ అధికారులు దీనిని అడ్డుకోగా వారిపై ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా మండవల్లి మండలం చింతపాడు నుండి పశ్చిమ గోదావరి జిల్లా యాగనమిల్లి వరకు రహదారి నిర్మాణం చేయడానికి ప్రభాకర్‌ ఇటీవల ప్రయత్నించారు. దీనిని చింతపాడు గ్రామస్తులు అడ్డుకున్నారు. 

రఘువీరా సహా కాంగ్రెస్‌ నేతల అరెస్టు

కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మించ తలపెట్టిన వివాదాస్పద రంగారెడ్డి -పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో నిర్వహించిన మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. ప్రకాశం బ్యారేజీ వద్దకు ర్యాలీగా బయలుదేరిన నాయకులను పోలీసులు అడుగడుగునా అరెస్టులు చేశారు. దీంతో విజయవాడ అలంకార్‌ కూడలి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు రణరంగంలా మారింది. బ్యారేజీ సందర్శనకు అనుమతి లేదంటూ వందలాది మంది పోలీసులు నాయకులను అడ్డుకున్నారు. 

13 స్మార్ట్ సిటీల జాబితా

స్మార్ట్ సిటీల రెండో జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి వరంగల్కు చోటు దక్కింది. 13 నగరాల పేర్లతో కూడిన స్మార్ట్ సిటీల రెండో జాబితాను మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఈ జాబితాలో లక్నో తొలి స్థానంలో నిలవగా, వరంగల్ 9వ స్థానంలో నిలిచింది.

జాబితాలోని స్మార్ట్ సిటీలు

50 లక్షల మందితో వెట్టిచాకిరి..

రాష్ట్రంలో 65 రకాల ఉత్పత్తి రంగాల్లో 50 లక్షలకుపైగా కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుని ఏడాదికి రూ.500 కోట్ల శ్రమను యజమానులు దోచుకుంటు న్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ తెలిపారు. సిఐటియు కర్నూలు జిల్లా 10వ మహాసభలో పాల్గొనేందుకు ఆదోనికి వచ్చిన ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మిక శాఖ రెండేండ్ల పెరిగే ధరలకను గుణంగా వివిధ సెక్టార్లలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేత నాలు పెంచాలని కోరారు. 15 ఏళ్లుగా కార్మిక శాఖ వేతనాల పెంపుదల జోలికే వెళ్లలేదన్నారు.

జయతో ప్రమాణస్వీకారం చేయించిన రోశయ్య

తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమె మరో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మద్రాస్‌ యూనివర్శిటీ సెంటినరీ సమావేశ మందిరంలో రాష్ట్ర గవర్నర్‌ రోశయ్య జయలలితతో ప్రమాణస్వీకారం చేయించారు. 

చంద్రన్న కాపుభవనాలపై ఆగ్రహం

కాపు భవనాలకు కూడా చంద్రన్న పేరు పెట్టాలన్న నిర్ణయం కలకలం రేపింది. చంద్రన్న కాపుభవనాలు అంటూ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనపై కాపు నేతలు భగ్గుమన్నారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్రస్థాయిలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. దీంతో సర్కారులో కదలిక మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం నాడు తన నివాసంలో అధికారులతో దీనిపై ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. 

ఇరాన్‌ చేరుకున్న ప్రధాని మోడీ

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్‌ రాజధాని టెహరాన్‌ చేరుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపై ఇవాళ ఇరాన్‌ అధ్యక్షడు హసన్‌ రౌహనీతో చర్చలు జరుపుతారు. ఆదేశ అగ్రనేత ఆయతుల్లా ఖొమైనీని కూడా మోదీ కలుస్తారు.

స్వరాజ్‌ మైదాన్‌ కనుమరుగు..

సుదీర్ఘ చరిత్ర కలిగిన స్వరాజ్య మైదానం (పిడబ్ల్యుడి) గ్రౌండ్స్‌) రూపు రేఖలు మారిపోనున్నాయి. సిటీ స్క్వేర్‌ పేరుతో మైదానంలో ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. చైనాకు చెందిన జిఐసిసి సంస్థ రూపొందించిన సిటీ స్క్వేర్‌ ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ డిజైన్‌కు సిఎం చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు.

హోదాపై మౌనం ఎందుకు..?

నాలుగొందల శతాబ్ధాల చరిత్రకలిగిన హైదరాబాద్‌ ఆర్ధిక వివర్తన, అమరావతిలో ఆచరణసాధ్యం కాదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఒంగోలులో జరిగిన అఖిల భారత అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా అంశంపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో మాట్లాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడెందుకు ప్రత్యేక హోదాపై మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్‌ కేటగిరి అవసరంలేదనే వాదన అర్థంలేనిదని అన్నారు.

బాబుకు ముద్రగడ లేఖాస్త్రం

కాపులను బీసీల్లో చేర్చాలని ఉద్యమం చేస్తున్న ముద్రగడ మరోసారి సీఎం చంద్రబాబుకు లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖలో పలు ప్రశ్నలు..పలు విమర్శలు గుప్పించారు. కాపులను బీసీలో చేర్చే చర్యలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పేద కాపులకు రుణాల మంజూరు గురించి ఆలోచించారా ? అని ప్రశ్నించారు. చంద్రన్న కానుకలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత ఆస్తి వివరాలు ఇచ్చినట్లుగా పేర్లు ఏంటనీ ప్రశ్నించారు.

Pages

Subscribe to RSS - May