May

వివాదాస్పదంగా మోడీ విద్యార్హత

మోడీ గుజరాత్‌ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అతను పూర్తి చేశానని చెబుతున్న ఎంఏ సంపూర్ణ రాజనీతి శాస్త్రం (ఎంటైర్‌ పొలిటికల్‌ సైన్స్‌) అంశం ఆ యూనివర్సిటీ సిలబస్‌లోనే లేదని జయంతీ భారు పటేల్‌ ఆరోపించారు. 'ప్రధాని మోడీ సర్టిఫికెట్లలో పేర్కొన్న ఎంఏ పార్ట్‌-2 పేపర్లలో కూడా చాలా వ్యత్యాసాలు కనపడుతున్నాయి. నాకున్న సమాచారం మేరకు, ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ విద్యార్థులకు అలాంటి సబ్జెక్టులు ఉండవు' అని పటేల్‌ చెప్పారు. 

ఈనెల 17న మోదీతో బాబు భేటి

నరేంద్రమోదీతో ఈనెల 17వ తేదీన సమావేశం కాబోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి విభజన చట్టంలో పొందుపరిచిన నిబంధనలన్నీ అమలు చేయాలని కోరబోతున్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటించినట్టుగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా, ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.24,350 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. రెవిన్యూలోటు భర్తీ, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధుల అంశాన్ని కూడా ప్రధానమంత్రి ముందుంచబోతున్నారు.

311మంది అభ్యర్థులపై నేరారోపణలు

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల్లో 202 మంది కోటీశ్వరులున్నారట. అంతేగాక.. 311 మంది అభ్యర్థులపై నేరారోపణలు ఉన్నట్లు తెలిసింది. అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌), కేరళ ఎన్నికల పరిశీలన కమిటీ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

రాజ్యసభకు జూన్ 11న ఎన్నికలు

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 57 మంది సభ్యుల పదవీ కాలం జూన్-ఆగస్టు మధ్య పూర్తవుతున్నందున జూన్ 11న ఎన్నికల నిర్వహిస్తామని పేర్కొంది. పదవీ విరమణ చేస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు

భారత రైల్వేలపై కొత్త పెట్టుబడులు

మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందున, దేశంలో కొత్త పెట్టుబడుల ద్వారా వ్యాపారాన్ని భారీగా పెంచుకోవాలని కెనడాకు చెందిన అంతర్జాతీయ రవాణా రంగ సంస్థ బొంబాడియర్‌ నిర్ణయించింది. ఇప్పుడు భారత్‌లో 300 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) వ్యాపారం చేస్తున్నామని, అయిదేళ్లలో బిలియన్‌ డాలర్ల (రూ.6,600 కోట్లకు పైగా) వ్యాపారం సాధించాలనేది లక్ష్యమని బొంబాడియర్‌ అధ్యక్షుడు లారెంట్‌ ట్రోగర్‌ తెలిపారు. 

ఆరోగ్య పథకంలో రూ.500 కోట్ల అక్రమాలు

మహారాష్ట్రలో భారీ ఆరోగ్య పథకం ‘రాజీవ్‌గాంధీ జీవనదాయీ ఆరోగ్య యోజన(ఆర్‌జీజేఏవై)’లో అనైతిక వ్యాపార కార్యకలాపాలు, అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఓ టాస్క్‌ఫోర్స్‌ వెలుగులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు ఇటీవల సమర్పించిన నివేదిక ప్రకారం.. ఆర్‌జీజేఏవైలో ఆర్థిక అవకతవకల కారణంగా గత మూడేళ్ల కాలవ్యవధిలో ప్రభుత్వ ఖజానాకు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 

1.5 లక్షల గ్రామాలు కరవు కోరల్లో..

దేశంలో నాలుగో వంతు భాగాన్ని కరవు కబళించివేసిందని, సుమారు 1.5 లక్షల గ్రామాలు కరవు కోరల్లో చిక్కుకున్నాయని లోక్‌సభకు ప్రభుత్వం వెల్లడించింది. 

ఇంకా ఎంత మంది బలికావాలి..?

ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టే రాజధాని నిర్మాణానికి ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటారని సీపీఎం నేతలు ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం గురించి గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు వేరే రాష్ట్రం నుండి తీసుకొచ్చిన కార్మికులను ఎంతో గౌరవంగా చూసుకోవాల్సిన అవసరంముందని వారు సూచించారు. ఏపీ తాత్కాలిక రాజధాని వెలగపూడిలో తీవ్ర ఉద్దికత్తల మధ్య సీపీఎం ఎమ్మెల్సీలు ఆ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దాదాపు 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారనీ..వారికి ఎటువంటి మౌలిక సదుపాయాలను కల్పించకుండా పశువులకంటే హీనంగా వారితో పనిచేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాల్యాను అప్పగించడం కుదరదు

వేల కోట్ల రుణాల ఎగవేసి భారత్‌ విడిచి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యాను తమ దేశం నుంచి వెళ్లగొట్టలేమని బ్రిటన్‌ స్పష్టం చేసింది.పాస్‌పోర్టు రద్దు చేసినా కూడా తమ దేశ చట్టాల ప్రకారం మాల్యాను పంపించలేమని చెప్పింది. అయితే మాల్యాను వెనక్కి రప్పించడానికి భారత్‌కు సాయం చేస్తామని ప్రకటించింది.

Pages

Subscribe to RSS - May