May

అర్ధాంతరంగా ముగిసిన JNU సమావేశం

జేఎన్‌యూ అకడమిక్‌ కౌన్సిల్‌ (ఏసీ) సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. నిరాహారదీక్ష కొనసాగిస్తున్న విద్యార్థులు మధ్యాహ్నం తమ దీక్షా స్థలాన్ని సమావేశం జరిగే సోషల్‌ సైన్సెస్‌ విభాగం భవనం వద్దకు మార్చారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు అన్ని ద్వారాల వద్ద నినాదాలు చేశారు. వీసీ జగదీశ్‌కుమార్‌ విద్యార్థులున్న చోటి నుంచి కాకుండా వేరే మార్గం గుండా మీటింగ్‌ హాల్‌కు చేరుకున్నారు. విద్యార్థుల వ్యతిరేకతను మూటగట్టుకున్న మాజీ రిజిస్ట్రార్‌ భూపిందర్‌ జుత్షి, ప్రస్తుత రిజిస్ట్రార్‌, రెక్టార్‌, ప్రొక్టార్‌, దళితులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ప్రొ.

పనామాలో మరో 2000 చిట్టా..

పనామా పత్రాల్లోని వివరాల్ని అంతర్జాతీయ పరిశోధక జర్నలిస్టుల కన్సార్టియం(ఐసీఐజే) మరోసారి పెద్దమొత్తంలో విడుదల చేసింది. ఈసారి భారత్‌కు చెందిన 2000 వివరాల్ని బయటపెట్టింది. అందులో 1046 మంది వ్యక్తులకు సంబంధించిన లింకులు, 828 అడ్రసులు, 42 మధ్యవర్తి సంస్థల పేర్లు ఉన్నాయి. నెవడా, హాంగ్‌కాంగ్‌, బ్రిటీష్‌ వర్జీన్‌ ఐల్యాండ్‌వంటి 21 దేశాల్లో నల్ల కుబేరులు అక్రమంగా డబ్బు దాచుకున్నట్టు తెలుస్తున్నది. భారత్‌తోపాటు పలు దేశీయులకు చెందిన 2,14,000 రహస్య కంపెనీల వివరాలను 
కన్సార్టియం ఇప్పుడు వెల్లడించింది

వామపక్షాల యాత్ర..తీవ్ర ఉద్రిక్తత..

ఏపీ తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఏపీ సర్కారు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. ఏపీ తాత్కాలిక రాజధాని ప్రాంతంలో దేవేందర్ అనే కార్మికుడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో గత రెండు రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికుడి మృతిపై ప్రభుత్వ స్పందనను నిరసిస్తూ సీపీఎం నేతలు రాజధాని యాత్ర చేపట్టారు. కార్మికులకు మద్ధతు తెలపాటానికి వచ్చిన నేతలపై పోలీసులు లాఠీ చేశారు. 

కార్మిక హక్కుల కోసం రాజధాని యాత్ర

వెలగపూడి సచివాలం ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్తత నెలకొంది. సచివాలయం నిర్మాణ ప్రాంతంలో కార్మికుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వామపక్ష నేతలు కార్మికులకు మద్దతుగా వచ్చిన సీపీఎం నేతలను మంగళవారం నాడు లాఠీ ఛార్జ్ జరిపారు. ఈ ఘటనలో సీపీఎం నేతలను  అరెస్ట్ చేసి పోలీసులు  నిర్భంధంలో వుంచారు.కార్మిక పక్ష నేతలమైన మేము దేనికి భయపడమనీ కార్మికులకు మా మద్ధతు ఎప్పుడూ వుంటుందని వామపక్ష నేతలు పేర్కొంటున్నారు.

అగస్టా కుంభకోణంపై సుదీర్ఘ చర్చ

అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంపై పార్ల మెంట్‌లో చర్చ...రచ్చ అయ్యింది. ఈ కుంభకో ణానికి సంభందించి శుక్రవారం కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ లోక్‌సభలో ప్రభుత్వం తరపున ప్రకటన చేశారు. ఈ ప్రకటకతో సభలో గందరగోళం నెలకొంది. అధికార, విపక్షాలు పరస్పర నినాదాలు, అరుపులు, కేకలతో సభ దద్దరి ల్లింది. దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగిన సభలో విపక్ష కాంగ్రెస్‌ సభ్యలు అసహనం తో వాకౌట్‌ చేశారు. పలు సార్లు ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వైఖరిపై మండిపడ్డారు. శుక్రవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై చర్చ జరిగింది.

మోడీ డిగ్రీ చేసినట్టు ఆధారాలు లేవు..

 ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ చేసినట్టు ఆధారాలు లేవని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. 1975 నుంచి 1980 వరకు ఢిల్లీ యూనివర్సిటీ ఫైళ్లను తాము పరిశీలించామని కానీ నరేంద్ర దామోదర్‌దాస్‌ మోడీ అనే పేరు గల వ్యక్తి డిగ్రీ చేసినట్టు తమకు ఎలాంటి ఆధారాలూ లభించ లేదని ఆప్‌ నేత ఆశిష్‌ ఖేతన్‌ తెలిపారు. రాజ స్థాన్‌లోని అల్వార్‌ నివాసి అయిన నరేంద్ర కుమార్‌ మహవీర్‌ ప్రసాద్‌ మోడీ అనే వ్యక్తి 1975 -78 కాలంలో డిగ్రీ చేసినట్టు యూనివ ర్సిటీ ఫైళ్లలో ఉన్నదని దానికి నరేంద్ర మోడీ చూపిన డిగ్రీకి పోలికలు లేవని ఆయన తెలిపారు.

ఎరువుల సబ్సిడీకి కూడా నగదు బదిలీ..

ఆరోగ్య బీమా పధకాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ పథకంతో అనుసంధానం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఎరువులకు సంబంధించిన సబ్సిడీ లను కూడా ఈ పథకానికి జత చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. 
ఎరువుల కొను గోలుపై సబ్సిడీని నగదు బదిలీ ద్వారా రైతులకు నేరుగా అం దచేసే విధానాన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమ లుచేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి జయంత్‌ సిన్హా చెప్పా రు. 

33 మందిపై మోడీ వేటు..

మోడీ ప్రభుత్వం 33మంది రెవెన్యూ అధికారులను విధుల నుంచి తొలగించింది. అందులో ఆరుగురు గ్రూప్‌ ఏకు చెందిన అధికారులు ఉండడం గమనార్హం. ఆరుగురు గ్రూపు ఏ అధికారులతో సహా ఇతర శాఖల అధికారులను విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదన్న కారణంతో ముందస్తుగా పదవి నుంచి విరమింపజేసినట్టు ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రెండు సంవత్సరాల్లో 72 మంది అధికారులను విధుల్లో నుంచి తొలగించినట్టు పేర్కొంది.

జేఎన్‌యూపై రాష్ట్రపతి జోక్యానికి వినతి

జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ దమన వైఖరిపై ప్రతిపక్ష ఎంపీల బృందం శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఫిర్యాదు చేసింది. కాగా విద్యార్థుల దీక్షలు నేడు 10వ రోజుకు చేరుకున్నాయి. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కన్నయ్యకుమార్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది.

సింగపూర్‌, జపాన్‌ వ్యాపారస్తుల‌ కోసం పేదల ఇళ్ళు క్చూడం అన్యాయం. సి.పి.ఎం. ధర్నా

కృష్ణా పుష్కరాల పేరు చెప్పి ఘాట్‌ను నిర్మిస్తామని, ప్రజల ఇబ్బందును తొల‌గించేందుకు ఇళ్ళు తొల‌గించాల్సి వస్తుందని మాయమాటలు చెబుతున్న తెలుగుదేశం ఈ ప్రాంతంలో పర్యాటక రంగం పేరుతో సింగపూర్‌, జపాన్‌కంపెనీల‌ వ్యాపారాల కోసం పేదల ఇళ్ళు కూల్చ‌డం అన్యాయం.  వెంటనే ఈ చర్యలు వెనక్కి తీసుకోవాల‌ని కోరుతూ కరకట్టవాసులు శుక్రవారం ఉదయం సైన్స్‌సెంటర్‌ వద్ద పెద్దఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు శ్రీ సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ కృష్ణాపుష్కరాల‌కు నిజంగా ఇళ్ళు తొగించాల్సిన అవసరంలేదు.

Pages

Subscribe to RSS - May