November

విలీన మండలాల సమగ్రాభివృద్ధిని కోరుతూ పాదయాత్ర..

ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణంపై సమావేశాలు ఏర్పాటు చేస్తారేగానీ ముంపు మండలాల గిరిజనుల ఘోష మాత్రం పట్టించుకోవడం లేదు. 2018 లోగ పోలవరం పూర్తీ చేస్తామంటున్న ప్రభుత్వం ఏడుమండలాల ప్రజలకు ప్యాకేజి,పునరావాసం కల్పించకుండా వారిని జలసమాధి చేయాలని చూస్తోందని విలీన మండలాల సమగ్రాభివృద్ధి కొరకు చేపట్టిన పాదయాత్రలో రాష్ట్ర సర్కార్ పై మండిపడిన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబురావు తదితరులు..

దివీస్ ఫార్మా కంపెనీని తొలిగించాలి..

తూర్పుగోదావరి జిల్లా దానవాయిపేట నుంచి దివీస్‌ కంపెనీని తొలిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.కంపెనీని తొలగించకపోతే చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.తొండంగి మండలం దానవాయిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివీస్‌ కంపెనీకి వ్యతిరేకంగా దానవాయిపేటలో సీపీఎం నిర్వహించతలపెట్టిన సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎంరాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు 200 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

ద‌ళిత‌, మ‌త్స్య‌కారుల సమస్యలపై పాదయాత్ర

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా క‌నిపిస్తున్న కాకినాడ స్మార్ట్ సిటీ వాసుల స‌మ‌స్య‌ల‌పై సీపీఎం ఉద్య‌మం ప్రారంభించింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల సాధ‌న కోసం పాద‌యాత్ర సాగిస్తోంది. కాకినాడ‌లో ఇంద్ర‌పాలెం వంతెన వ‌ద్ద ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యురాలు బేబీరాణి జెండా ఊపి యాత్ర‌ను ప్రారంభించారు. ద‌ళిత సంఘాల నేత‌లు రామేశ్వ‌ర రావు సహా ప‌లువురు మ‌ద్ధ‌తు తెలిపారు.న‌గ‌రంలోని ద‌ళిత‌, మ‌త్స్య‌కార పేట‌ల్లో పేరుకుపోయిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని నేత‌లు డిమాండ్ చేశారు.

సమైక్యతా సాధనంగా విద్య..

స్వతంత్ర భారత దేశ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ పుట్టిన రోజు నవంబర్‌ 11న జాతీయ విద్యా దినోత్సవంగా పాటించబడుతోంది. 1947 ఆగస్టు 15 నుంచి తాను మరణించిన 1958 ఫిబ్రవరి 22 వరకు పదిన్నర సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన మౌలానా ఆజాద్‌ దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు. రాజ్యాంగ విలువలతో కూడిన లౌకిక విద్యను అన్ని స్థాయిల్లోనూ అందరికీ సమానంగా అందించేందుకు బహుముఖ పథకాలు, ప్రణాళికలు రచించారు. కామన్‌ స్కూల్‌ సిస్టం, 10+2+3గా విద్యా విధాన చట్రాన్ని నిర్ధారించారు.

మోడీ వీసా రికార్డులు ఇవ్వాలి..

భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా ప్రవేశంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను వచ్చే ఫిబ్రవరి నాటికి తమకు సమర్పించాలని అమెరికా ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి విదేశాంగశాఖను ఆదేశించారు. 

రైతు ఉద్ధరణ ఇలాగా?

నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు తయారైంది పత్తి రైతుకు ప్రభుత్వం కల్పిస్తామన్న మద్దతు ధర. ఇంకేముంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేశాం పంట తేవడమే ఆలస్యం అని సర్కారీ పెద్దలు ఆశ పెట్టడంతో నిజమేననుకొని పత్తిని మార్కెట్‌ యార్డులకు తీసుకెళ్లిన రైతులు కొనుగోలు జాడ లేక తెల్లబోతున్నారు. తిరిగి పంటను ఇంటికి తీసుకెళ్లే స్తోమత లేక దళారులకు అయిన కాడికి తెగనమ్ముకొని నిలువు దోపిడీకి గురవుతున్నారు. రైతులను రక్షించాల్సిన ప్రభుత్వమే వంచిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలీక గుండెలు అవిసేలా బోరుమంటున్నారు. రైతులంటే పాలకులకు ఎందుకంత అలుసో అర్థం కాదు.

Pages

Subscribe to RSS - November