November

గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్ లో చేర్చాలి

నాన్ షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్ లో చేర్చాలని, గ్రానైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దుచేయాలని, స్ధానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా వి.మాడుగుల తహశీల్ధార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు 

రూ.కోట్లు తెచ్చినా జాడలేని అభివృద్ధి

భట్టిప్రోలుకు కోట్లాడి రూపాయాలు తెచ్చామని చెబుతున్నా అభివృద్ధి జాడ మాత్రం లేదని సిపిఎం పాదయాత్ర బృందం పేర్కొంది. ఆ పార్టీ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మండల కేంద్రమైన భట్టిప్రోలుతోపాటు అద్దేపల్లి, అక్కివారిపాలెం, పెదపులివర్రు, గొరికపూడి, కోళ్లపాలెం, ఓలేరు గ్రామాల్లో సాగింది. శ్మశాన వాటికలు, నివేశనా స్థలాల సమస్యలు మరీ దుర్భరంగా ఉన్నాయని ఆయా గ్రామాల వారు పాదయాత్ర బృందం వద్ద వాపోయారు. భట్టిప్రోలు, అద్దేపల్లిలో మురుగునీటి పారుదలకు డ్రెయిన్‌ నిర్మాణం చేపట్టినా ఫలితం లేదని, మురుగునీరి రోడ్లపైకి వచ్చి వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు వాపోయారు.

పెద్దందార్ల ఆక్రమణలో భూములు

శావల్యాపురం మండలంలోని కనమ ర్లపూడి, శావల్యాపురం, పోట్లూరు, ఇర్లపాడులో సిపిఎం పాదయాత్ర సాగింది. కనమర్లపూడి ఎస్‌సి కాలనీలో తాగునీరు, డ్రెయినేజీ, సిసి రోడ్ల సమస్యలను, శావల్యాపురంలో ఇళ్ల పట్టాలు, స్థలాలను స్థానికులు పాదయాత్ర బృందం దృష్టికి తెచ్చారు. శ్మశానా స్థలాల పక్క పొలాలవారు దారి మూసేశారని తెలిపారు. పోట్లూరు ఎస్‌సి కాలనీలో దగ్గర్లోని ఐదెకరాల ప్రభుత్వ పోరంబోకు భూములను పేదలకివ్వాలని, గ్రామంలో 300 మంది అగ్రీగోల్డ్‌ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని, ఇర్లపాడులో దళితులకు సంబంధించిన ఐదెకరాలను పెత్తందార్లు ఆక్రమించారని, ఎదిరించిన వారిపై కేసులు పెడుతున్నారని అక్కడివారు వాపో యారు.

పనులు లేకున్నా మద్యం తాగబోస్తున్నారు..

పనులు లేకుండా ఇళ్లల్లోని మగాళ్లతో మద్యాన్ని తాగబోస్తున్నారని అన్నవరప్పాడు మహిళలు వాపోయారు. పిల్లలను పోషించేందుకు అంతులేని అగచాట్లు పడుతున్నామని, కాస్తో కూస్తో కూలి డబ్బులున్నా వాటిని మార్చుకోడానికి బ్యాంకుల వద్ద పడే అగచాట్లు అన్నీ ఇన్ని కావని ఆవేదనను వెళ్లగక్కారు. సిపిఎం చేపట్టిన పాదయాత్ర నరసరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో గురువారం నిర్వహించారు. అన్నవరప్పాడులోని మహిళలు సిపిఎం బృందానికి తమగోడు వెళ్లబోసుకున్నారు.

పంపిణీ చేయకుంటే జెండాలు పాతుతాం

పేదల కోసమని పెదరావూరులో సేకరించిన భూమిని అర్హులకు పంపిణీ చేయకుంటే ఆ భూమిలో సిపిఎం జెండాలు పాతి పంచుతుందని ఆ పార్టీ డివిజన్‌ కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి చెప్పారు. 11 రోజులుగా సిపిఎం నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం వైకుంఠపురం కాల్వకట్ట, నరేంద్రదేవ్‌కాలనీ, హడ్కోకాలనీ, చినరావూరు తోట, చినరావూరు డొంక తదితర ప్రాంతాల్లో సాగింది. 50 ఏళ్ల నుండి వైకుంఠపురం కాల్వకట్ట, చినరావూరు డొంక రోడ్డులలో గుడిసెలు వేసుకుని ఉంటున్నామని, పట్టాల కోసం నాయకులను వేడుకుంటుంటూ పదేళ్ల నుండి ఊరుకుని గెలిచి రెండేళ్లే అయిన మమ్మల్ని అడిగితే ఎక్కడి నుండి తెస్తామని అంటున్నారని వాపోయారు.

గ్రామాల‌లో త్రాగునీటి స‌మ‌స్యతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

ముప్పాళ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు సిపిఎం పాదయాత్ర బృందం ఎదుట వాపోయారు. గురవారం మండలంలోని ఆయా గ్రామాలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈసందర్భంగా సిపిఎం డివిజన్‌ కార్యదర్శి వర్గ సభ్యులు జి. బాలకృష్ణ మాట్లాడుతూ మండలం లోని ఆయా గ్రామాల్లో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి వాటర్‌ట్యాంక్‌లు నిర్మించినప్పటికీ పైపులైన్ల ద్వారా నీటిని విడుదల చేయడంలేదని అన్నారు. రుద్రవరం, దమ్మాలపాడు, తొండపి, పలుదేవర్లపాడు గ్రామాల్లో వీధిలైట్లు లేక చీకటిలో నడవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.

'ఆధార్‌' ఉన్నా మరుగుదొడ్లకి అనుమతి ఇవ్వడంలేదు : సిపిఎం

:సమస్యల వలయంలో రేపల్లె పట్టణం కొట్టుమిట్టాడుతుందని ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర రెండోరోజైన మంగళవారం నేతాజికాలనీలో ప్రారంభమై అనంతరం 2, 20 వార్డుల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లంబాడీ కాలనీ, ఎస్టీకాలనీ వివిధ ప్రారతాల్లో పేదలు నివసిస్తున్న ఏరియాల్లో సమస్యలనడిగి తెలుసుకున్నామని చెప్పారు. మణిలాల్‌ మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌ వెనుక ఎస్టీకాలనీలో గతంలో 80 మందికి బీఫారం ఇచ్చారని అందరికి ఆధార్‌ కార్డులున్నా మరుగుదొడ్లు కట్టుకోవటానికి అవకాశం ఇవ్వటంలేదని చెప్పారు.

Pages

Subscribe to RSS - November